Advertisement

  • చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆ స్టార్ ఆటగాడి ప్రయాణం ముగిసినట్లేనా !

చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆ స్టార్ ఆటగాడి ప్రయాణం ముగిసినట్లేనా !

By: Sankar Mon, 31 Aug 2020 3:35 PM

చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆ స్టార్ ఆటగాడి ప్రయాణం ముగిసినట్లేనా !


సురేష్ రైనా ...మిస్టర్ ఐపీయల్ గా పేరు సంపాదించాడు అంటే ఐపీయల్ రైనా స్థాయి ఎలాంటిదో తెలుస్తుంది..లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు అయినా చెన్నై సూపర్ కింగ్స్ లో ధోని తర్వాత అంతటి స్థాయిని సంపాదించుకున్నాడు..లీగ్ ఆరంభం నుంచి ఇప్పటివరకు సిఎస్కె మీద నిషేధం విధించిన రెండు ఏళ్ళు తప్ప మిగతా అన్ని సీజన్లు చెన్నై తరఫుననే బరిలోకి దిగాడు..అంతేకాకుండా ఐపీయల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ తర్వాత స్థానంలో నిలిచాడు..మరి అలాంటి రాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకోనుందా అంటే చాల వరకు ఔను అనే సమాధానం వస్తుంది ..

సురేష్‌ రైనా ఐపీఎల్‌ టోర్నీనుంచి అనుహ్యంగా తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైనా నిష్క్రమణపై ఇప్పటికే అనేక అనుమానాలు, పుకార్లు వస్తున్నాయి. కరోనా భయం కారణంగా భారత్‌కు తిరిగి వచ్చాడని కొంతమంది భావిస్తుండగా... కుటుంబ సమస్యలతో తిరుగుముఖం పట్టాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దుబాయ్‌లో రైనాకు కేటాయించిన గది విషయంపై రైనా కొంత అసహం వ్యక్తం చేశాడని, ఈ క్రమంలోనే జట్టు యజమానికి అతనికి మధ్య స్పల్ప వివాదం ఏర్పడిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సీఎస్‌కే జట్టు యజమాని ఎన్‌ శ్రీనివాససన్‌ తాజాగా రైనాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. గది విషయంలో రైనా వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టిన శ్రీనివాసన్‌.. జట్టులో రైనా లేనంతమాత్రనా తమకేమీ న‍ష్టం లేదన్న రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రైనా స్థానంలో రాణించేందుకు ఎంతోమంది యువ ఆటగాళ్ల సిద్ధంగా ఉన్నారని కూడా పేర్కొన్నారు. శ్రీనివాసన్‌ తాజా కామెంట్స్‌ నేపథ్యంలో ఇరువురి మధ్య పెద్ద వాదనే జరిగినట్లు తెలుస్తోంది.

గొడవ కారణంగానే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి రైనా తప్పుకుని భారత్‌కు పయనమైనట్లు సమచారం. ఈ నేపథ్యంలో సీఎస్‌కేతో రైనా భవిష్యత్‌ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జట్టు యజమానిపైనే అతను దురుసుగా ప్రవర్తించాడని, ఇక రైనాతో ఒప్పందాన్ని సీఎస్‌కే పూర్తిగా రద్దు చేసుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :
|
|

Advertisement