Advertisement

గవాస్కర్ ఓటు కోహ్లీకి , హేడెన్ ఓటు ధోనికి

By: Sankar Thu, 10 Dec 2020 8:10 PM

గవాస్కర్ ఓటు కోహ్లీకి , హేడెన్ ఓటు ధోనికి


గత దశాబ్ద కాలంలో టీమిండియా వన్ డే క్రికెట్ లో అనేక గొప్ప గొప్ప విజయాలను నమోదు చేసింది ..అందులో 2011 ప్రపంచ కప్ , 2013 ఛాంపియన్ ట్రోఫీ ముఖ్యమైనవి ...అయితే ఈ రెండు ట్రోఫీలు ధోని సారథ్యంలో టీం ఇండియా అందుకుంది ..ఇక గత పదియేళ్ళుగా టీమిండియా విజయాలలో అత్యంత కీలక భూమిక పోషిస్తున్న ఆటగాడు కోహ్లీ..దీనితో ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఈ దశాబ్దంలో టీమిండియాకు విజయకాను అందించారు అనే విషయంలో మాజీ ఆటగాళ్లు భిన్న అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు..

స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన హెడెన్‌.. ‘‘ఎంఎస్‌ ధోని ప్రపంచకప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ సాధించాడు. వరల్డ్‌ కప్‌ సాధించడం అనేది ఒక ఆటగాడి జీవితంలో అతి పెద్ద మైలురాయి. వన్డే ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడినా, ఈ మెగా టోర్నీ విషయానికొచ్చేసరికి ఏవిధంగా సన్నద్ధమయ్యామనేదే ముఖ్యం. ఆ సమయంలో కేవలం ఒక మంచి నాయకుడిగా ఉంటే మాత్రమే సరిపోదు. ధోనిలాగా మిడిలార్డర్‌లో స్ట్రాంగ్‌ బ్యాట్స్‌మెన్‌గా కూడా ఉండాలి’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ మాత్రం కోహ్లికే ఓటు వేయడం గమనార్హం. గత దశాబ్ద కాలంగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది అతడే అని తేల్చిచెప్పాడు. క్రికెట్‌ కనెక్టెడ్‌ షోలో వీరిద్దరు ఈ మేరకు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

Tags :
|
|
|

Advertisement