Advertisement

  • కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలలో భారీగా పోలింగ్‌...

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలలో భారీగా పోలింగ్‌...

By: chandrasekar Wed, 09 Dec 2020 3:06 PM

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలలో భారీగా పోలింగ్‌...


మంగళవారం కేరళలో జరిగిన మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏప్రిల్, మే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీల బలం తేల్చే కీలకమైన ప్రదర్శనగా నిపుణుల అభిప్రాయం. తొలి దశ పోలింగ్‌లో 75 శాతం నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ శాంతియుతంగా జరిగింది. కొంతమంది కరోనా రోగులు కూడా పోలింగ్ ముగింపు సమయంలో పీపీఈ కిట్లు ధరించి ఓటు వేశారు. మొదటి దశలో తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పతనమిట్ట, ఇడుక్కి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. రెండవ దశ పోలింగ్ డిసెంబర్ 12 న, చివరి దశ పోలింగ్‌ డిసెంబర్ 14 న జరుగనున్నది. కౌంటింగ్ డిసెంబర్ 16 న జరుగుతుంది. పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మధ్యే ఎన్నికలు జరుగుతున్నాయి.

తన నాలుగున్నరేండ్ల పాలనపై పాలక ఎల్డీఎఫ్ ప్రజాభిప్రాయ౦ సేకరిస్తున్నది. ప్రతిపక్ష యూడీఎఫ్ కోసం ఇది అసెంబ్లీ ఎన్నికలకు ప్రధానమైన ఛాన్స్. మూడు దశాబ్దాలకు పైగా ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ప్రత్యామ్నాయంగా అధికారాన్ని పంచుకున్న రాష్ట్రంలో బీజేపీకి అధికారం అందిపుచ్చుకునే అవకాశం ఉ౦ది.

Tags :
|

Advertisement