Advertisement

అసోంలోని జోర్హాట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం...

By: chandrasekar Mon, 10 Aug 2020 7:42 PM

అసోంలోని జోర్హాట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం...


ఆదివారం రాత్రి 11.30 గంట‌ల‌కు అసోంలోని జోర్హాట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు చ‌నిపోగా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

జోర్హాట్‌లోని ఓ ఆటోమొబైల్ రిపేర్ షాప్‌లో మంట‌లు అంటుకున్నాయి. క్ర‌మంగా అవి బిల్డింగ్ మొత్తానికి వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు. మంట‌ల‌ను ఆర్ప‌డానికి అగ్నిమాప‌క సిబ్బంది తీవ్రంగా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.

సుమారు నాలుగున్న‌ర‌ గంట‌ల అనంత‌రం ఈరోజు తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు మంట‌లు పూర్తిగా అదుపులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌ర‌ణించార‌ని, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని చెప్పారు.

గాయపడిన వారిన హాస్పిటల్ కి త‌ర‌లించామ‌ని వెల్ల‌డించారు. ఆస్తినష్టానికి సంబంధించిన వివివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదన్నారు. అగ్నిప్ర‌మాదంలో మంట‌లు భారీగా ఎగ‌సిప‌డ‌టంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యార‌ని తెలిపారు.

Tags :
|
|

Advertisement