Advertisement

  • కూకట్ పల్లి లో ఫైర్ యాక్సిడెంట్ ...ఇంకా అదుపులోకి రాని మంటలు

కూకట్ పల్లి లో ఫైర్ యాక్సిడెంట్ ...ఇంకా అదుపులోకి రాని మంటలు

By: Sankar Sun, 15 Nov 2020 2:58 PM

కూకట్ పల్లి లో ఫైర్ యాక్సిడెంట్ ...ఇంకా అదుపులోకి రాని మంటలు


కూకట్‌పల్లి కేపీహెచ్బి కాలనీలోని ఓ హార్డ్‌వేర్‌ షాపులో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 6 గంటలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

మంటల తీవ్రతకు భవనం దెబ్బతిన్నది. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఎలక్ట్రికల్‌, ప్లాస్టిక్‌ వస్తువులు ఉండటంతో మంటలు కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారింది. మంటలు చెలరేగిన షాపునకు కిందనే సీఎంఆర్ జ్యువలర్స్‌ ఉండగా, ఓ వైపు వస్త్ర దుకాణం, మరోవైపు... జాయ్‌ అలూకాస్‌ షో రూమ్‌ ఉంది.

దాంతో ఫైర్ సిబ్బంది మంటలను వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నారు. గోల్డ్ కరిగిపోయింది ఏమో అనే ఆందోళన లో షాపు యజమానులు మునిగిపోయారు. దట్టమైన పొగ కారణంగా ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. బిల్డింగ్ వెనకవైపు రంద్రం చేసి.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

దీపావళి సందర్భంగా.. పెద్ద ఎత్తున పెయింట్ డబ్బాలు కొని స్టాక్ పెట్టారు నిర్వాహకులు. ఈ పెయింట్ డబ్బాల కారణంగా మంటలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. 10 కోట్ల రూపాయలు పైనే ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాధమిక అంచనా.

Tags :
|

Advertisement