Advertisement

  • కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయాలతో భారీగా మార్పులు

కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయాలతో భారీగా మార్పులు

By: chandrasekar Sat, 12 Sept 2020 10:00 AM

కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయాలతో భారీగా మార్పులు

అనతి కాలంగా కాంగ్రెస్ అధ్యక్షత పై పలువురు సీనియర్ నేతలు అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే. అందుకుగాను ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయాలు తీసుకున్న‌ది. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో, ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీలో అధిష్ఠానం భారీగా మార్పులు చేర్పులు చేసింది. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ని స‌మూలంగా పునర్వవస్థీకరించింది. కొత్త క‌మిటీలో పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్‌, పార్టీ మాజీ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీ, సీనియ‌ర్ నేత‌లు ఏకే ఆంటోనీ, అహ్మ‌ద్‌ప‌టేల్‌, అంబికా సోనీ, గులాంన‌బీ ఆజాద్, ఆనంద్ శ‌ర్మ స‌హా మొత్తం 22 మందిని స‌భ్యులుగా నియ‌మించారు. ఇక, సీనియ‌ర్ నేత‌లు దిగ్విజ‌య్ సింగ్‌, మీరా కుమార్‌, అధిర్ రంజ‌న్ చౌద‌రి, జైరామ్ ర‌మేశ్‌, సల్మాన్ ఖుర్షీద్ స‌హా 26 మంది కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (CWC) శాశ్వ‌త ఆహ్వానితులుగా, దీపెందర్‌సింగ్ హుడా, కుల్దీప్ బిష్నోయ్‌, చింతా మోహ‌న్‌, స‌చిన్‌రావు, సుస్మితాదేవ్ స‌హా 10 మంది CWC ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మితుల‌య్యారు.

అంతే కాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీలోని సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ అథారిటీని కూడా పార్టీ హైక‌మాండ్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించింది. ఇందులో మ‌ధుసూద‌న్ మిస్త్రీ చైర్మ‌న్‌గా రాజేశ్ మిశ్రా, క్రిష్ణ బైరెగౌడ‌, జ్యోతిమ‌ణి, అర్వింద‌ర్‌సింగ్ స‌భ్యులుగా ఉన్నారు. ఇక‌, ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ ప‌ద‌వుల్లో ప‌ద‌వుల్లో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం భారీగా మార్పులు చేసింది. పలువురు సీనియర్లకు ఉద్వాసన పలికింది. సీనియ‌ర్ నేత‌లు గులాంన‌బీ ఆజాద్‌, అంబికాసోని, మోతీలాల్ వోరా, లుజేనియా ఫ‌లేరియో, మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేల‌ను పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ ప‌ద‌వుల నుంచి త‌ప్పించింది. బీజేపీ కి గట్టి ప్రత్యర్థిగా ఉండటానికి కావలసిన మార్పులు తీసుకొచ్చారు.

ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీలుగా ప్ర‌స్తుతం ముకుల్ వాస్నిక్‌, హ‌రీశ్‌రావ‌త్‌, ఊమెన్ చాందీ, తారిక్ అన్వ‌ర్‌, ప్రియాంకాగాంధీ వాద్రా, రాజ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా, జితేంద్ర‌సింగ్‌, అజ‌య్ మాకెన్‌, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీల్లో ప్రియాంకాగాంధీ వాద్రాకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ముకుల్ వాస్నిక్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు, హ‌రీశ్‌రావ‌త్ (పంజాబ్‌), ఊమెన్ చాందీ (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌), తారిక్ అన్వ‌ర్ (కేర‌ళ‌, ల‌క్ష‌ద్వీప్‌), రాజ్‌దీప్ సుర్జేవాలా (క‌ర్ణాట‌క‌), జితేంద్ర‌సింగ్ (అసోం), అజ‌య్ మాకెన్ రాజ‌స్థాన్‌కు పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జిలుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. వీరితోపాటు పార్టీలోని మ‌రికొంద‌రు కీల‌క నేత‌లకు వివిధ రాష్ట్రాల పార్టీ వ్య‌వ‌హారాల బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీనివల్ల పార్టీని మరింత బలోపేతం చేసినట్లు అయింది.‌

Tags :

Advertisement