Advertisement

రష్యాలో సామూహిక టీకాలు...

By: chandrasekar Thu, 03 Dec 2020 11:06 AM

రష్యాలో సామూహిక టీకాలు...


రష్యాలో కరోనా కారణంగా కొత్త 589 మరణాలు నమోదయ్యాయి. దాంతో వచ్చే వారం సామూహికంగా స్వచ్ఛంద టీకాలు ఇవ్వడం మొదలుపెట్టేందుకు రష్యా రెఅడీ అవుతున్నది. కరోనాకు వ్యతిరేకంగా తయారుచేసిన వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ వేయాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం రష్యా అధికారులను ఆదేశించారు. రాబోయే కొన్ని రోజుల్లో రష్యా 2 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులను ఉత్పత్తి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. గత నెలలో తమ స్పుత్నిక్ వీ జబ్ మధ్యంతర ఫలితాల ప్రకారం కరోనా నుంచి ప్రజలను రక్షించడంలో 92 శాతం ప్రభావవంతంగా ఉందన్నారు. పెద్ద ఎత్తున టీకాలు వేయడం డిసెంబర్‌లో స్వచ్ఛంద ప్రాతిపదికన ప్రారంభమవుతుందని ఉప ప్రధాని టటియానా గోలికోవా పేర్కొన్నారు.

బుధవారం నాడు రష్యాలో 25,345 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ యొక్క సెకండ్‌ వేవ్ సమయంలో లాక్‌డౌన్లను విధించడాన్ని రష్యా ప్రతిఘటించింది. 2,347,401 ఇన్ఫెక్షన్లతో రష్యా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, ఇండియా, బ్రెజిల్ దేశాలున్నాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రష్యాలో 41,053 మరణాలు నమోదయ్యాయి. రష్యన్లు టీకాలు వేయడానికి మొదటి స్థానంలో ఉన్నారని క్రెమ్లిన్ ఇంతకుముందు హామీ ఇచ్చింది. మాస్కో ఇతర దేశాలతో సరఫరా ఒప్పందాలపై కూడా చర్చించింది. ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తి రష్యన్ల అవసరాలను తీరుస్తుంది అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. బుధవారం 3,684 కొత్త అంటువ్యాధులను నివేదించిన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని అధికారులు అక్కడ కేసుల పెరుగుదలను ఎదుర్కోవటానికి డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు. రష్యా నూతన సంవత్సర సెలవుల కాలానికి డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు 5 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మ్యూజియంలు, థియేటర్లు, కచేరీ హాళ్ళు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :
|
|

Advertisement