Advertisement

ట్రాన్స్‌ప‌రెంట్‌గా ఉండే మాస్కులు

By: chandrasekar Tue, 23 June 2020 12:52 PM

ట్రాన్స్‌ప‌రెంట్‌గా ఉండే మాస్కులు


కొన్ని నెల‌ల క్రితం ఉపాధి కోసం మాస్కుల వ్యాపారం చేప‌ట్టిన ఓ మ‌హిళ‌కు ఇప్పుడు బాగా గిరాకి దొర‌కుతున్న‌ది. ఈ ఫేస్‌మాస్కులు చాలా ట్రాన్స్‌ప‌రెంట్‌గా ఉంటాయి. ముఖానికి ధ‌రించిన‌ప్పుడు చాలా అందంగా క‌నిపించ‌డంతో పాటు ఎన్నిరోజులైనా బోర్ కొట్ట‌క‌పోవ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. అంతేకాదు ఇందులో చిన్న‌పిల్ల‌ల‌కు కార్టూన్ మాస్కులు కూడా ఉన్నాయి. ఆట వ‌స్తువులుగా ఉన్న ఈ మాస్కులు ధ‌రించేందుకు పిల్ల‌లు మొగ్గు చూపుతారంటున్న‌ది థాయ్‌లాండ్‌కు చెందిన 31 ఏండ్ల సింగిల్ మ‌ద‌ర్ మేసా తాలెర్డ్.

ఈ మాస్కులు క‌రోనా వైర‌స్ నుంచి ర‌క్షించ‌డ‌మే కాకుండా ఆత్మ‌ర‌క్ష‌ణ‌గా కూడా ఉప‌యోగ‌ప‌డుతాయంటున్న‌ది. చిన్న స్టూడియో రూంను ఏర్పాటు చేసుకొని ప్ర‌ముఖ హీరోలు, విల‌న్ల రూపాల‌ను స్టిక్క‌ర్ల రూపంలో షీల్డ్స్‌పై ముద్రిస్తున్న‌ది. ఈ వ్యాపారాన్ని న‌లుమూల‌లా విస్త‌రింప‌జేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది.

స్టార్స్ చిత్రాల నుంచి జ‌ప‌నీస్ సూప‌ర్ హీరోలు, థాయ్ జాన‌ప‌ద క‌థానాయ‌కులు, విల‌న్లు, బొమ్మ‌ల వ‌ర‌కు డార్త్ వాడ‌ర్‌, అత‌ని స్టార్మ్‌ట్రూప‌ర్ల ముఖాల క‌వ‌చాలు కావాలంటూ ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయట‌. కొన్ని నెల‌ల క్రితం మేసాకు ఆదాయమే లేదు. క‌రోనా స‌మ‌యంలో ఆర్డుర్లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయంటున్న‌ది. ఒక్క ట్రాన్స‌ప‌రెంట్ మాస్క్ 5.77 డాల‌ర్ల‌కు విక్ర‌యిస్తున్న‌ది. భ‌విష్య‌త్తులో ఇది మంచి వ్యాపారంగా మార‌బోతున్న‌ట్లు భావిస్తున్న‌ది. ఎందుకంటే బొమ్మ‌ల దుకాణాలు ఆమెను సంప్ర‌దిస్తున్నాయి.

Tags :
|
|

Advertisement