Advertisement

  • మాస్క్ లతో పిల్లలకు ముప్పు ..తాజా అధ్యయనంలో వెల్లడి

మాస్క్ లతో పిల్లలకు ముప్పు ..తాజా అధ్యయనంలో వెల్లడి

By: Sankar Tue, 26 May 2020 7:40 PM

మాస్క్ లతో పిల్లలకు ముప్పు ..తాజా అధ్యయనంలో వెల్లడి

మాస్కుల ఇప్పుడు మనిషి జీవితంలో ఓ భాగం. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరి. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీటి ప్రాధాన్యం మరింత పెరిగింది. అయితే చిన్నారులకు, అదీ రెండేళ్ల లోపు వారికి మాస్కుల వల్ల ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని జపాన్‌లో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. పిల్లల శరీరంలోని ఊపరి తిత్తుల్లోని గొట్టాలు సన్నాగా ఉండటంతో పెద్దల కంటే చిన్నారులు మాస్కుల వల్ల పెను ప్రమాదం ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఎక్కవ సేపు చిన్నారులు మాస్కులు ధరించడం వల్ల ప్రాణవాయువు అందక మారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వెలుగులోకి వచ్చింది. ముఖాన్ని మాస్కుతో పూర్తిగా కప్పేయడం వల్ల శరీరంలోని వేడి బయటిపోయే దారిలేక వడదెబ్బ తిగిలే అవకాశం కూడా ఉందని ఈ అధ్యయనం చేస్తోంది. దీంతో.. చిన్నారులకు మాస్కులు తొడిగే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.

Tags :
|
|

Advertisement