Advertisement

  • స్నేహితులు చేసిన పనికి పీటల మీద ఆగిన పెళ్ళికొడుకు పెళ్లి

స్నేహితులు చేసిన పనికి పీటల మీద ఆగిన పెళ్ళికొడుకు పెళ్లి

By: Sankar Tue, 15 Dec 2020 7:44 PM

స్నేహితులు చేసిన పనికి పీటల మీద ఆగిన పెళ్ళికొడుకు పెళ్లి


మరికొద్ది సేపట్లో పెళ్లి ..పెళ్లి కొడుకు , పెళ్లి కూతురు రెడీ గా ఉన్నారు ..కానీ అప్పుడే పెళ్లి కొడుకు స్నేహితులు చేసిన పనికి ఆ పెళ్లి ఆగిపోయింది.. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని బరేలీలో ఆలస్యంగా వెలుగుచూసింది..పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనౌజ్‌ జిల్లాకు చెందిన ఓ యువతికి బరేలీకి చెందిన యువకుడితో కొద్దినెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది.

శుక్రవారం పెళ్లి రోజు కావటంతో మేలతాళాలతో పెళ్లికూతురు తరుపు వారు బరేలిలోని పెళ్లి కుమారుడి ఇంటికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో తాళి కట్టే తరుణం ఆసన్నమవుతుందనగా.. పెళ్లి కుమారుడి స్నేహితులు పెళ్లి కూతుర్ని డ్యాన్స్‌ చేయాలంటూ బలవంతంగా డ్యాన్స్‌ చేసే వేదికపైకి లాక్కెళ్లారు.

దీనిపై పెళ్లి కుమార్తె కుటుంబం అభ్యతరం తెలిపింది..సంస్కారం లేని ఇలాంటి వాడితో తమ కూతురుకి పెళ్లి చేసేది లేదని తెగేసి చెప్పడంతో పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లి అర్దాంతరంగా ఆగిపోయింది...ఎంతమంది సర్దిచెప్పిన కూడా పెళ్లి కూతురు తరుపువారు ససేమిరా అనడంతో పెళ్లి ఆపక తప్పలేదు...


Tags :

Advertisement