Advertisement

  • పెళ్ళికి ఒక్కరోజు ముందు పెళ్లి కూతురుకు కరోనా ..పెళ్లి వాయిదా

పెళ్ళికి ఒక్కరోజు ముందు పెళ్లి కూతురుకు కరోనా ..పెళ్లి వాయిదా

By: Sankar Sun, 26 July 2020 2:18 PM

పెళ్ళికి ఒక్కరోజు ముందు పెళ్లి కూతురుకు కరోనా ..పెళ్లి వాయిదా



శ్రావణ మాసం మొదలు అయింది అంటే చాలు పెళ్లిలా సందడి మొదలవుతుంది ..కానీ ఈ సారి కరోనా కారణంగా పెళ్లిళ్లకు ఇబ్బంది వచ్చి పడింది ..వాయిదా వేసుకుందాం అంటే మళ్ళీ ఇప్పట్లో ముహుర్తాలు లేవు , అంతేగాక కరోనా ఎప్పుడు తగ్గుతదో కూడా ఎవ్వరు చెప్పలేని పరిస్థితి ..అందుకే ఉన్నంతలోనే పెళ్లి చేయాలనీ అందరూ భావిస్తున్నారు ..అయినా కూడా కరోనా వదిలేలా లేదు ..తాజాగా తెల్లారితే పెళ్లి వేడుకలు జరగాల్సి ఉంది. అంతలోనే పెళ్లి కూమార్తెకు కరోనా పాజిటివ్‌ అని రిపోర్టు రావడంతో... దీంతో చేసేదేమీ లేక వివాహం వాయిదా వేసుకోవాల్సిన వచ్చింది ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులోనూ చోటుచేసుకుంది.

నందికొట్కూరు పట్టణానికి చెందిన చెంచు కాలనీకి చెందిన ఓ యువతకి వివాహం నిశ్చయమైంది. 25న ముహూర్తం, 26న తలంబ్రాలు పెట్టుకున్నారు. అయితే కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం పెళ్లికి మూడు రోజుల ముందు వధూవరులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం పెళ్లి కూతురికి పాజిటివ్‌ అని నివేదిక రావడంతో అధికారులు హుటాహుటీన ఆ యువతి ఇంటికి చేరుకుని విషయం చెప్పారు.

అధికారుల సూచన మేరకు ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి వాయిదా వేసుకున్నారు. మరోవైపు నందికొట్కూరులో కరోనా విజృంభించింది. ఈ నెల 22న కోటా హైస్కూల్‌ వద్ద 378మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వందమందికి పాజిటివ్‌ వచ్చింది..

Tags :
|
|
|
|

Advertisement