Advertisement

  • ఎంపీ కోమటిరెడ్డి కూతురుతో వైసీపీ సీనియర్ నేత కుమారుడి వివాహం...

ఎంపీ కోమటిరెడ్డి కూతురుతో వైసీపీ సీనియర్ నేత కుమారుడి వివాహం...

By: chandrasekar Wed, 25 Nov 2020 5:17 PM

ఎంపీ కోమటిరెడ్డి కూతురుతో వైసీపీ సీనియర్ నేత కుమారుడి వివాహం...


తెలంగాణ భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు వివాహం రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో ఘనంగా జరిగింది. ఎంపీ కోమటిరెడ్డి తన కుమార్తె శ్రీనిధిని, ఏపీలో వైసీపీకి చెందిన ప్రముఖ సీనియర్ నేత కుమారుడు ప్రణవ్‌తో బుధవారం ఘనంగా జరుగుతోంది.

కరోనా‌ కారణంగా ఈ వేడుకలో ఇరుకుటుంబాల దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. కర్నూలుకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్‌ రెడ్డి కుమారుడైన ప్రణవ్‌ రెడ్డితో శ్రీనిధికి వివాహం నిశ్చయించారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లోని లీలాప్యాలెస్‌ వేదికగా వీరిద్దరి కల్యాణం వైభవంగా జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్, ఆ పార్టీకి చెందిన నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ వివాహ సంబంధంతో వీరి మధ్య స్నేహం మరింత ధృడంగా మారబోతుంది. ఇటీవల వారి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ శిల్పా మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలో అతడి సోదరుడి కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తున్నారు.

Tags :
|

Advertisement