Advertisement

  • తమిళనాట టాక్ ఆఫ్ ది టౌన్ గా మరీనా వైరముత్తు వ్యవహారం...చిన్మయి సంచలన ట్వీట్స్

తమిళనాట టాక్ ఆఫ్ ది టౌన్ గా మరీనా వైరముత్తు వ్యవహారం...చిన్మయి సంచలన ట్వీట్స్

By: chandrasekar Thu, 15 Oct 2020 3:57 PM

తమిళనాట టాక్ ఆఫ్ ది టౌన్ గా మరీనా వైరముత్తు వ్యవహారం...చిన్మయి సంచలన ట్వీట్స్


ప్రముఖ గాయని చిన్మయి తమిళ౦లో ప్రముఖ గేయ రచయితగా పేరు తెచ్చుకున్న వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు యత్నించినట్లు గతంలో అతడిపై ఆరోపించడం ఆమె చేసిన #MeToo ఆరోపణలు తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలోనే సంచలనం సృష్టించడం తెలిసిందే. రెండేళ్ల క్రితం అలా వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి.. తాజాగా అతడిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది.

గతంలో ఓ టీవీ ఛానెల్లో వీజేగా పనిచేసిన మరో యువతిపైనా వైరముత్తు వేధింపులకు పాల్పడ్డాడని చిన్మయి ఆరోపించింది. ఆ వీడియో జాకీ పంపించిన మెసేజ్‌లను ట్విటర్‌లో షేర్‌ చేసుకున్న చిన్మయి.. సదరు యువతికి కుటుంబం నుంచి సహకారం లేకపోవడం వల్లే తనకు ఎదురైన వేధింపులపై ఆమె పెదవి విప్పడానికి రెండేళ్లు పట్టిందని తన ట్వీట్‌లో తెలిపింది.

తనకు వైరముత్తు చేతిలో వేధింపులకు గురైన బాధిత యువతి పంపిన మొబైల్ సందేశాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని చిన్మయి ట్విటర్‌లో షేర్ చేసుకోగా అందులో ఇలా రాసి ఉంది.‘ తాను కాలేజీ చదువుకునే రోజుల్లోనే ఓ పుస్తకావిష్కరణలో వైరముత్తును కలిసి ఆటోగ్రాఫ్‌ అడిగానని అప్పుడు ఆయన ఆటోగ్రాఫ్‌తో పాటు తన ఫోన్‌ నంబర్‌ కూడా రాసిచ్చారని, కానీ తనది చిన్న వయసు కావడంతో ఆయన నంబర్‌ ఎందుకిచ్చారనే విషయాన్ని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను.

ఆ తర్వాత తాను ఓ టీవీ ఛానెల్‌లో వీజేగా పనిచేస్తున్న రోజుల్లో ఓసారి తనని కలిసిన వైరముత్తు ఈసారి తన మొబైల్‌ నంబర్‌ అడిగి తీసుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక అది మొదలు తరచూ ఫోన్‌ చేయడం, సందేశాలు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడని ఆయన వ్యవహార శైలి గురించి తెలుసుకుని షాక్‌ అయ్యానని ఆ యువతి అందులో చెప్పుకొచ్చారు. మౌంట్‌ రోడ్దు దగ్గరున్న ఓ ప్రాంతానికి తనని రమ్మని వేధించేవాడని చెప్పుకుని ఆ యువతి తీవ్ర ఆవేదన వ్యక్తంచేసినట్టుగా చిన్మయి ట్విటర్‌లో షేర్ చేసుకున్న స్క్రీన్‌షాట్స్‌లో రాసి ఉంది. తాను తన ఫోన్ నెంబర్‌ మార్చినా ఎలాగోలా తెలుసుకొని ఫోన్‌ చేస్తుండేవారు. చివరకు తాను పనిచేస్తున్న టీవీ ఛానెల్ బాస్ సహాయంతో వైరముత్తు భార్యకు ఫోన్ చేసి చెప్పిన తర్వాతే అతడి నోరు మూయించగలిగాను’ అని వైరముత్తుపై ఆ యువతి చేసిన ఆరోపణలను చిన్మయి అలాగే ట్విటర్‌లో షేర్ చేసుకోవడంతో మరోసారి వైరముత్తు వ్యవహారం తమిళనాట టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

Tags :
|

Advertisement