Advertisement

  • ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో వివాదానికి దారితీసిన మార‌డోనా గోల్

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో వివాదానికి దారితీసిన మార‌డోనా గోల్

By: chandrasekar Thu, 26 Nov 2020 11:14 AM

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో వివాదానికి దారితీసిన మార‌డోనా గోల్


ప్రపంచంలోనే గొప్ప ఫుట్ బాల్ వీరుడు అందని లోకానికి వెళ్ళిపోయాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జం డీగో మార‌డోనా బుధ‌వారం క‌న్నుమూశారు. 60 ఏళ్ల వ‌య‌సులో హార్ట్ ఎటాక్‌తో ఆయ‌న చ‌నిపోయారు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాల‌ర్స్‌లో ఒక‌డిగా పేరుగాంచిన డీగో మారడోనా ఎంత గొప్ప ప్లేయ‌రో అన్ని వివాదాల్లోనూ నిలిచారు. ఆట త‌ర్వాత డ్ర‌గ్స్‌కు బానిసయ్యాడు. 1994 ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అర్జెంటీనా టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించినా డ్ర‌గ్ టెస్ట్ వల్ల విఫ‌ల‌మై మ‌ధ్య‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు.

దిగ్గజ ఆటగాడు మార‌డోనా తన కెరీర్ త‌ర్వాతే కాదు ఫుట్‌బాల్ ఆడే స‌మ‌యంలోనూ ప‌లు వివాదాల‌తో వార్త‌ల్లో నిలిచాడు. అందులో ప్ర‌ముఖంగా చెప్పుకునేది హ్యాండ్ ఆఫ్ గాడ్‌. 1986 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫుట్‌బాల్ ల‌వ‌ర్స్ అంద‌రికీ తెలిసిందే. అర్జెంటీనాను విశ్వ‌విజేత‌గా చేయ‌డంలో మార‌డోనా పాత్ర మ‌ర‌వ‌లేనిది. అయితే ఆ టోర్నీలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మార‌డోనా చేసిన ఓ గోల్ వివాదానికి కార‌ణ‌మైంది. ఆ గోల్‌ను మార‌డోనా చేత్తో చేశాడ‌ని అంటారు. రూల్స్ ప్ర‌కారం అలాంటి గోల్ చేసిన మార‌డోనాకు ఎల్లో కార్డ్ చూపించాలి. కానీ ఆలా జరగలేదు.

ఎల్లో కార్డు చూపిస్తే ఆ గోల్ కూడా లెక్క‌లోకి రాదు. కానీ రిఫ‌రీలు మాత్రం దానిని స‌రిగా చూడ‌క‌పోవ‌డంతో అర్జెంటీనాకు 1-0 లీడ్ వ‌చ్చింది. త‌ర్వాత ఆ మ్యాచ్‌ను అర్జెంటీనా 2-1తో గెలిచింది. త‌ర్వాతి గోల్ కూడా మార‌డోనానే చేశాడు. దీనిని గోల్ ఆఫ్ ద సెంచ‌రీగా అభివ‌ర్ణిస్తారు. అయితే మ్యాచ్ త‌ర్వాత వివాదాస్ప‌ద గోల్ గురించి మార‌డోనా మాట్లాడుతూ ఆ గోల్‌ను కాస్త త‌న త‌ల‌తో, మ‌రికాస్త హ్యాండ్ ఆఫ్ గాడ్‌తో చేశాన‌ని చెప్పాడు. అలా అది హ్యాండ్ ఆఫ్ గాడ్‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. ప్రపంచంలో మారడోనాని తెలియని వారు ఎవ్వరు వుండరు.

Tags :

Advertisement