Advertisement

  • మానవ దుశ్చర్యతో మృత్యువాత పడుతున్న అనేక జీవాలు

మానవ దుశ్చర్యతో మృత్యువాత పడుతున్న అనేక జీవాలు

By: chandrasekar Wed, 10 June 2020 5:02 PM

మానవ దుశ్చర్యతో మృత్యువాత పడుతున్న అనేక జీవాలు


కేరళ లో ఏనుగు మృత్యువాత పడిన సంగతి అందరికి తెలిసేందే. ఇలా దేశంలో వేరు వేరు ప్రాంతాల్లో అనేక రకాల జీవులు మృత్యువాత పడుతున్నట్లు వివరాలు తెలియజేస్తున్నది.

అసోంలో కాఛార్ జిల్లాలోని ఓ రిజర్వాయర్ లో దాదాపు 13 కోతుల మృతదేహాలు ల‌భ్య‌మవ్వ‌డం క‌ల‌కలం రేపింది. తాజాగా ఇలాంటిదే మ‌రో ఘ‌ట‌న కర్ణాట‌క రాష్ట్రంలో వెలుగు చూసింది.

చిక్కమగళూరులో ఓ వ్య‌క్తి పొలంలోకి అడ‌వి జంతువులు ప్ర‌వేశించ‌కుండా విషం పూసిన పనస పండ్లు పెడితే.. వాటిని తిని మూడు ఆవులు మృత్యువాత‌ప‌డ్డాయి. చిక్కమగళూరు జిల్లా బాసవరళ్లి గ్రామానికి చెందిన కొట్టె గౌడ, మధు అనే వ్యక్తులకు చెందిన మూడు ఆవులు విషంతో కూడిన పనస పండ్లు తిని మ‌ర‌ణించాయి. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.


Tags :
|

Advertisement