Advertisement

  • విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ తివారి భార్య

విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ తివారి భార్య

By: Sankar Mon, 01 June 2020 7:35 PM

విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ తివారి భార్య

అద్భుతమైన టాలెంట్ ఉంది , గంగూలీ తర్వాత బెంగాల్ నుంచి మళ్ళీ ఆ స్థాయికి వెళ్తాడు అనుకున్న ఆటగాడు మనోజ్ తివారి ..రంజీ మ్యాచ్ లలో అద్భుతంగా రాణించే తివారి , జాతీయ జట్టులో ఎందుకో నిలకడగా స్థానం సంపాదించలేకపోయాడు..కొన్ని మ్యాచ్లతోనే జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు ఆ తర్వాత ఎంత ప్రయత్నిచిన జట్టులో మళ్ళీ చోటు సంపాదించలేకపోయాడు..

అయితే సోషల్‌ మీడియాలో తివారి మీద వస్తున్న విమర్శలపై అతని భార్య సుష్మితా రాయ్‌ మండిపడ్డారు. తన భర్తను విఫలమైన క్రికెటర్‌గా పేర్కొనడంపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడానికి ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. టీమిండియాలో విఫలమైన ఆటగాళ్లు వీళ్లేనంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది. అందులో మనోజ్‌ తివారీ పేరు కూడా ఉంది. తాజాగా ఈ పోస్ట్‌పై స్పందించిన సుష్మితా అందుకు సంబంధించిన క్లిప్‌ను షేర్‌ చేశారు. తన భర్త పేరును ఆ జాబితాలో చేర్చడానికి ఎంత ధైర్యం అని ప్రశించారు. ఇటువంటి అర్థం లేని పోస్ట్‌లు క్రియేట్‌ చేసే ముందు నిజాలు చెక్‌ చేసుకోవడం మంచిదని హెచ్చరించారు. ఇతరుల గురించి చెడు ప్రచారం చేసే బదులు.. ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలని హితవు పలికారు.

కాగా, 2008లో టీమిండియాలో స్థానం దక్కించుకున్న తివారీ.. తన కేరీర్‌లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొత్తంగా టీమిండియా తరఫున కేవలం 12 వన్డేలు, 3 టెస్టులు మాత్రమే ఆడారు. మరోవైపు ఐపీఎల్‌ విషయానికి వస్తే.. 2012లో కేకేఆర్‌ ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు. 2018లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో తివారీని పంజాబ్‌ జట్టు దక్కించుకోగా.. 2019లో మాత్రం అతడికి నిరాశే మిగిలింది. ఇక, దేశవాలీ క్రికెట్‌కు సంబంధించి బెంగాల్‌ జట్టులో తివారీ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. ఇటీవల బెంగాల్‌ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరడంలో తివారీ కీలక భూమిక పోషించారు. 11 మ్యాచ్‌ల్లో 707 పరుగులు సాధించారు. మళ్లీ తిరిగి సత్తా చాటడానికి తివారీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. సుష్మిత కూడా తన భర్తకు చాలా మద్దతుగా నిలుస్తున్నారు.


Tags :
|
|

Advertisement