Advertisement

  • జులై 31 వరకు పాఠశాలలు బంద్ ..ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

జులై 31 వరకు పాఠశాలలు బంద్ ..ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

By: Sankar Fri, 26 June 2020 8:44 PM

జులై 31  వరకు పాఠశాలలు బంద్ ..ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం



దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 31 వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. విద్యా విభాగం అధికారులతో సమావేశం అనంతరం మంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారులతో జరిగిన సమావేశంలో సిలబస్‌ను 50 శాతానికి కుదించడంపై చర్చించినట్టు ప్రభుత్వం తెలిపింది. తల్లిదండ్రుల సహకారంతో ఆన్‌లైన్ తరగతులు, యాక్టివిటీలను కొనసాగించేందుకు అధికారులు అంగీకరించినట్టు పేర్కొంది.

విద్యార్థులను కొత్త పరిస్థితులకు అనుగుణంగా, భయపడకుండా తయారుచేసే విధంగా పాఠశాలలను తిరిగి తెరవడానికి ఒక ప్రణాళికను రూపొందిద్దాం. ఇది మన విద్యార్థులు కరోనావైరస్‌తో జీవించడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది" అని సిసోడియా పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులను చిన్న గ్రూపులుగా విభజించి వారానికి మూడుసార్లు క్లాసులు నిర్వహించాలని అధికారులు సిసోడియాను కోరగా, మరికొందరు అధికారులు మాత్రం పదో తరగతి విద్యార్థులకు ప్రతి రోజు క్లాసులు నిర్వహించాల్సిందేనని అన్నారు. సాధ్యమైన చోట పాఠశాలలు ఆన్‌లైన్ లైబ్రరీలు తెరిచేందుకు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.

Tags :
|
|

Advertisement