Advertisement

  • ఆసక్తి రేకెత్తిస్తున్న కాజల్ కొత్త మూవీ పోస్టర్‌

ఆసక్తి రేకెత్తిస్తున్న కాజల్ కొత్త మూవీ పోస్టర్‌

By: Sankar Fri, 19 June 2020 1:29 PM

ఆసక్తి రేకెత్తిస్తున్న కాజల్ కొత్త మూవీ  పోస్టర్‌



కాజల్ అగర్వాల్- మంచు విష్ణు జంటగా నటిస్తున్న హాలీవుడ్‌-ఇండియ‌న్ మూవీ 'మోసగాళ్లు'. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రంలో కాజల్ పోషిస్తున్న పాత్ర పేరు 'అను' కాగా, మంచు విష్ణు పోషిస్తున్న పాత్ర పేరు 'అర్జున్'. ఈ రెండు పాత్రలే సినిమాకు మేజర్ అసెట్ అని టాక్. ఏసీపీ కుమార్‌గా సునీల్ శెట్టి కనిపించనున్నారు.

కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి కాజల్ లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ రోజు (జూన్ 19) కాజల్ పుట్టినరోజు కానుకగా మరో అట్రాక్టివ్ లుక్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అర్థభాగం మంచు విష్ణు, మరో అర్థభాగం కాజల్ కనిపిస్తున్నారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇక ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన మంచు విష్ణు.. కాజల్ అగర్వాల్‌కి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు అమేజింగ్ టాలెంట్ ఉన్న హీరోయిన్ అని ఆమెను పొగిడాడు. అదేవిధంగా పెద్ద పెద్ద సెక్సీ కళ్లతో ఇంకా మరెన్నో సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.


Tags :
|

Advertisement