Advertisement

  • దినేష్‌ కార్తీక్‌ పై మేనేజ్‌మెంట్ వేటు..కేకేఆర్ కెప్టెన్‌‌గా ఇయాన్ మోర్గాన్.

దినేష్‌ కార్తీక్‌ పై మేనేజ్‌మెంట్ వేటు..కేకేఆర్ కెప్టెన్‌‌గా ఇయాన్ మోర్గాన్.

By: chandrasekar Fri, 16 Oct 2020 7:56 PM

దినేష్‌ కార్తీక్‌ పై మేనేజ్‌మెంట్ వేటు..కేకేఆర్ కెప్టెన్‌‌గా ఇయాన్ మోర్గాన్.


ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్ దినేష్‌ కార్తీక్‌ పై మేనేజ్‌మెంట్ వేటు వేసినట్లు తెలుస్తోంది. దినేష్‌ కార్తీక్‌‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో నేటి నుంచి కేకేఆర్ కెప్టెన్‌‌గా ఇయాన్ మోర్గాన్ వ్యవహరించనున్నాడు. కాగా, ముంబై ఇండియన్స్‌ తో మ్యాచ్ నేపథ్యంలో దినేష్ కార్తీక్ నుంచి మోర్గాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

బ్యాటింగ్‌పై ఫోకస్ చేసేందుకు తాను కెప్టెన్సీని వదులుకుంటున్నానని దినేష్ కార్తీక్ అంటున్నాడు. ఇయాన్ మోర్గాన్‌తో చర్చించిన తర్వాత తాను ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడని కార్తీక్ అన్నాడు. కేకేఆర్ జట్టుకు 37 మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించిన కార్తీక్ కెప్టెన్సీ మార్క్ మాత్రం చూపించలేకపోయాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మూడు జట్లకు విదేశీ కెప్టెన్లు వ్యవహరిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్‌కు స్టీవ్ స్మిత్ కెప్టెన్లుగా ఉన్నారు.

Tags :

Advertisement