Advertisement

  • ఫేక్ జిపిఎస్ తో ఆన్లైన్ రమ్మీలో 70 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి

ఫేక్ జిపిఎస్ తో ఆన్లైన్ రమ్మీలో 70 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి

By: Sankar Wed, 09 Dec 2020 5:03 PM

ఫేక్ జిపిఎస్ తో ఆన్లైన్ రమ్మీలో 70 లక్షలు పోగొట్టుకున్న  వ్యక్తి


ఇటీవల కాలంలో ఆన్లైన్ లో ప్రజలు అనేక విధాలుగా మోసపోతున్నారు ..ఎక్కువగా ఆన్లైన్ లో గేమ్స్ ఆడటం వలన డబ్బులు పోగొట్టుకుంటున్నవారు ఇటీవల కాలంలో చాలా ఎక్కువ అయ్యారు ..

అందుకే తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ రమ్మీ మీద ప్రభుత్వం నిషేధం విధించింది...దీనితో చేసేది ఏమిలేక యువత ఫేక్ జిపిఎస్ అడ్రస్ లు పెట్టి ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు..అయితే ఒక వ్యక్తి ఇలాగే ఫేక్ జిపిఎస్ తో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ .70 లక్షలు పోగొట్టుకున్నాడు..దీనితో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు..

అయితే రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ నిషేధం ఉండగా ఎలా ఓపెన్ అయిందంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయం బయటపడింది. బాధితుడు ఫేక్ జీపీఎస్ యాప్ ద్వారా లాగిన్ అయినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులే అవాక్కయ్యారు. హైదరాబాద్‌లో ఉంటూ యాప్ ద్వారా వేరే రాష్ట్రాలలో ఉన్నట్లుగా చూపించి లాగిన్ అవుతున్నట్లు తెలిసింది. ఫేక్ జీపీఎస్‌తో ఆడినట్లు తేలడంతో కేసు నమోదు చేయలేమంటూ పోలీసులు తేల్చిచెప్పారు.

Tags :
|
|

Advertisement