Advertisement

  • ప్రేమించిందని కూతురును క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన తండ్రి

ప్రేమించిందని కూతురును క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన తండ్రి

By: Sankar Fri, 07 Aug 2020 10:53 AM

ప్రేమించిందని కూతురును క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన తండ్రి



రోజు టీవీలలో , పేపర్లలో ఎన్నో పరువు హత్యల గురించి , వాటి వలన జరిగే నష్టాల గురించి ఎన్ని సార్లు చూయించిన కూడా ఇంకా కొంతమంది మారడం లేదు ..తమకు నచ్చని వాడిని , లేదా నచ్చని అమ్మాయిని ప్రేమించారు అని తల్లి తండ్రులు పిల్లల మీద తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు ..కొన్ని సార్లు అది తీవ్ర పరిణామాలకు కూడా దారితీస్తుంది ..ప్రస్తుతం ఇలాంటి ఘటనే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నగరంలో జరిగింది.

తన కూతురు ప్రేమలో పడి కుటుంబ పరువు తీస్తోందన్న ఆక్రోశంతో దారుణానికి పాల్పడ్డాడో తండ్రి. కన్నబిడ్డ అన్న కనికరం కూడా లేకుండా క్రికెట్‌ బ్యాట్‌తో తలపై కొట్టి చంపేశాడు..గాంధీ గ్రామ్ ప్రాంతానికి చెందిన గోపాల్ నకూం అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కొంతకాలం క్రితం అతడి భార్య చనిపోవడంతో కూతురితో కలిసి ఉంటున్నాడు. ఇటీవల అతడి కూతురు స్థానికంగా ఓ యువకుడితో ప్రేమలో పడింది. తరుచూ అతడితో బయటికి వెళ్తుండటంతో ఈ విషయం తండ్రికి తెలిసింది.

ఈ విషయంపై కూతురితో ఎన్నోసార్లు గొడవపడ్డాడు. ప్రేమలో పడి పరువు తీస్తోందని కోప్పడేవాడు. బుధవారం కూడా ఇదే విషయంపై అతడు కూతురితో గొడవపడ్డాడు. ఆమె ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆవేశానికి గురై క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోపాల్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags :
|
|

Advertisement