Advertisement

  • కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడు డాక్టర్లకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా !

కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడు డాక్టర్లకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా !

By: Sankar Thu, 17 Sept 2020 3:27 PM

కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడు డాక్టర్లకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా !


కరోనా మహమ్మారి పోరులో కరోనా వారియర్స్ రాత్రి పగలు అనే తేడా లేకుండా పోరాడుతున్నారు..ఈ పోరాటంలో కొంతమంది తమ తోరణాలను కూడా వదిలారు..అయినా కూడా ప్రజలను ఈ మహమ్మారి నుంచి రక్షించడానికి పోరాడుతూనే ఉన్నారు..అందుకే అలాంటివారిపట్ల అందరూ కృతజ్ఞతా భావం చూపాల్సిందే. ఓ వృద్ధుడు ఇదే పనిచేశాడు. తనకు కొవిడ్‌ చికిత్స చేసిన వైద్యులకు తన సొంత పొలంలో పండిన బియ్యాన్ని బహుమతిగా ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. నెటిజన్ల మనస్సు గెలుచుకున్నాడు.

తమ దవాఖానలో చికిత్స పొంది కొవిడ్‌ నుంచి కోలుకున్న ఓ వృద్ధుడు తన పొలంలో పండించిన బియ్యాన్ని బహుమతిగా ఇచ్చాడని డాక్టర్ ఉర్వి శుక్లా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. వృద్ధుడు ఇచ్చిన బియ్యం ఫొటోను పెట్టారు. అతడు ఐసీయూలో 15 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందాడని పేర్కొన్నారు. పూర్తిగా కోలుకోగా ఇటీవల డిశ్చార్జ్‌ చేసినట్లు చెప్పారు.

అయితే, తమకు కృతజ్ఞతలు తెలిపేందుకు తాను పండించిన బియ్యాన్ని బహుమతిగా ఇచ్చాడని శుక్లా వెల్లడించారు. అతడు ఇచ్చిన బియ్యాన్ని ఆశీర్వాదంలాగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ట్వీట్‌ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో వైరల్‌ అయ్యింది. 3,300 కన్నా ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

Tags :
|
|

Advertisement