Advertisement

  • అదృష్టం అంటే ఇతడిదే ..నాలుగవ అంతస్థు నుంచి కింద పడ్డా కూడా ఏమి కాలేదు ..

అదృష్టం అంటే ఇతడిదే ..నాలుగవ అంతస్థు నుంచి కింద పడ్డా కూడా ఏమి కాలేదు ..

By: Sankar Sat, 01 Aug 2020 11:10 AM

అదృష్టం అంటే ఇతడిదే ..నాలుగవ అంతస్థు నుంచి కింద పడ్డా కూడా ఏమి కాలేదు ..



అదృష్టం బాలేకపోతే ఆవగింజ తిన్న కూడా మరణిస్తారు అని అంటారు ..కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తికి మాములు అదృష్టం లేదు అందుకే బిల్డింగ్ నాల్గవ అంతస్థు నుంచి జారీ పడితే కూడా చనిపోలేదు సరికదా మాములు గాయాలతో బయటపెట్టాడు ..దీనితో అతడికి ఈ భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి అంటున్నారు ..ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది.

ద‌క్షిణ ఢిల్లీలోని మాల‌వీయ‌న‌గ‌ర్‌లోని అస్త అపార్ట్‌మెంట్‌లో నాలుగు అంత‌స్తులు ఉన్నాయి. జులై 29న భారీ వ‌ర్షం కురియ‌డంతో.. భ‌వ‌నంపై భాగాన నీళ్లు ఏమైనా ఉన్నాయా? అని చూసేందుకు కిష‌న్ కుమార్(40) అనే వ్య‌క్తి భ‌వ‌నంపైకి ఎక్కాడు. భ‌వ‌నం పైక‌ప్పును ప‌రిశీలిస్తుండ‌గా.. ప్ర‌మాద‌వ‌శాత్తు కింద‌కు ప‌డిపోయాడు.

అయితే ఆ భ‌వ‌నం గేట్ గ్రిల్స్‌ అతనికి కుచ్చుకున్నాయి. కాళ్ల‌కు గ్రిల్స్ కుచ్చుకోవ‌డంతో త‌ల‌కిందులు అయిపోయాడు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. వెల్డ‌ర్ ను పిలిపించి గ్రిల్స్‌ను తొల‌గించి.. కిష‌న్‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. లాక్‌డౌన్ కంటే ముందు కుమార్‌.. బ్యూటీ సెలూన్‌ను గురుగ్రాంలో నిర్వ‌హిస్తుండేవాడు.

Tags :
|
|
|
|

Advertisement