Advertisement

  • సునీత మేనల్లుడి పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఆకతాయిని అరెస్ట్ చేసిన పోలీసులు

సునీత మేనల్లుడి పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఆకతాయిని అరెస్ట్ చేసిన పోలీసులు

By: Sankar Wed, 12 Aug 2020 5:10 PM

సునీత మేనల్లుడి పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఆకతాయిని అరెస్ట్ చేసిన పోలీసులు



సినిమా వాళ్ళ పేరు చెప్పుకొని మోసం చేస్తున్న ఆకతాయిల ఘటనలు ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువ అయ్యాయి ..అమాయకుల అభిమానాన్ని ఆసరాగా తీసుకోని ఈ ఆకతాయిలు రెచ్చిపోతారు ..ఇటీవలే నా మేనల్లుడు అంటూ ఒకడు చెప్పుకుంటున్నాడు వాడికి నాకు ఏ సంబంధం లేదు అసలు నాకు మేనల్లుడు ఎవరు లేరు అని ప్రముఖ సింగర్ సునీత చూపిన విషయం తెలిసిందే ..

అయితే ఇప్పటికే సునీత మేనల్లుడిని అని చెప్పుకుంటూ మోసానికి పాల్పడిన చైతన్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతని చేతిలో మోససోయిన ఓ మహిళ రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ. 1.70 కోట్ల మోసం బయటపడింది.

కొత్తపేటకు చెందిన ఓ మహిళ సింగర్‌సునీతకు వీరాభిమాని. దీన్ని ఆసరాగా చేసుకున్న చైతన్య అనే వ్యక్తి సునీత్ వాట్సాప్ ఫోన్ నంబర్ ఇదేనని ఓ నంబర్‌ ఇచ్చాడు. అలా ఆమెను నమ్మించాడు. ఇలా కొద్ది రోజులు గడిశాక.. ఒకరోజు కేరళలోని 'ఆనంద చేర్లాయం ట్రస్ట్‌'లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో .. బాధితురాలు వారు సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను బదిలీ చేసింది.

అమెరికాలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టానంటూ నమ్మించి పలు దఫాలుగా రూ.1.7 కోట్లు బాధితురాలి నుండి వసూలు చేశారు. ఎప్పటికప్పుడు గాయని ఫొటోలు వాట్సాప్‌లో పంపించే వారు కానీ ఎప్పుడూ వీడియో కాల్‌ మాట్లాడేవారు కాదు. దీంతో అనుమానం వచ్చి బాధితురాలు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైతన్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Tags :
|
|
|

Advertisement