Advertisement

  • ఇతడికి అదృష్టం ఒక్కసారి కాదు , ఏకంగా 25 సార్లు తలుపు కొట్టింది

ఇతడికి అదృష్టం ఒక్కసారి కాదు , ఏకంగా 25 సార్లు తలుపు కొట్టింది

By: Sankar Fri, 07 Aug 2020 8:29 PM

ఇతడికి అదృష్టం ఒక్కసారి కాదు , ఏకంగా 25 సార్లు తలుపు కొట్టింది



అదృష్టం అనేది ఒకసారి తలుపు తడితే చాలు అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ..అయితే ఒక వ్యక్తికి మాత్రం అదృష్టం ఒక్కసారి కాదు ఏకంగా 25 సార్లు తలుపు కొట్టింది ..అమెరికాలోని వ‌ర్జీనియా రాష్ట్రానికి చెందిన రేమండ్ హారింగ్ట‌న్ అనే వ్య‌క్తిని కూడా అదృష్టం తుమ్మ బంక‌లా ప‌ట్టుకుంద‌ట‌! అత‌ను ఒక దుకాణం నుంచి ఒక్కో లాట‌రీ టికెట్‌కు డాల‌ర్ చొప్పున వెచ్చించి 25 టికెట్లు కొంటే ప్ర‌తి టికెట్‌పై న‌గ‌దు వ‌చ్చింద‌ట‌.

వివ‌రాల్లోకి వెళ్తే వర్జీనియా రాష్ట్రానికి చెందిన రేమండ్ హారింగ్టన్ గత నెల 17న స్థానికంగా ఉన్న బీచ్‌కు వెళ్లాడు. బీచ్ వద్ద ఉన్న ఓ దుకాణంలో 25 డాల‌ర్లు వెచ్చించి డాలర్‌కు ఒకటి చొప్పున 25 లాట‌రీ టికెట్లు కొనుగోలు చేశాడు. అందులో ఒక్క టికెట్‌పై న‌గ‌దు వ‌చ్చినా చాలు అనుకున్నాడు. కానీ హారింగ్ట‌న్ కొన్న ప్ర‌తి టికెట్‌పైన 5 వేల డాల‌ర్ల చొప్పున మొత్తం 1,25,000 డాల‌ర్లు (దాదాపు రూ.94 ల‌క్ష‌లు) న‌గ‌దు లభించింది.

కొన్న ప్ర‌తి లాట‌రీ టికెట్‌పై న‌గ‌దు ల‌భించింద‌ని తెలిసిన వెంట‌నే రేమండ్ హారింగ్ట‌న్ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాడు. అనంత‌రం సంతోషంతో ఎగిరి గంతులేశాడు. లాట‌రీలో గెలిచిన డబ్బును తన ఇద్దరు కొడుకుల చదువు కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపాడు.

Tags :
|
|
|

Advertisement