Advertisement

ఆడుకుంటున్న బాలికపై లైంగిక దాడికి యత్నం

By: Anji Sat, 19 Sept 2020 09:52 AM

ఆడుకుంటున్న బాలికపై లైంగిక దాడికి యత్నం

ఎన్ని కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన కూడా చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా అనంతపురం రూరల్‌ పరిధిలోని అక్కంపల్లి ధర్మభిక్షం కాలనీలో బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు.

రూరల్‌ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కాలనీలో తమ్ముడితో కలిసి ఆడుకుంటున్న ఓ బాలికకు అదే కాలనీకి చెందిన ఎస్‌.బాషా (52) అనే వ్యక్తి మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. ఎవరూలేని సమయం చూసి లైంగికదాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడే అటువైపు వచ్చిన బాలిక తల్లి చూసి కేకలు వేసింది. దీంతో బాషా అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు బాషాపై పోక్సో చట్టం కింద రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Advertisement