Advertisement

  • విశాఖలో రెచ్చిపోయిన మరొక ప్రేమోన్మాది...యువతిపై కత్తితో దాడి

విశాఖలో రెచ్చిపోయిన మరొక ప్రేమోన్మాది...యువతిపై కత్తితో దాడి

By: Sankar Wed, 02 Dec 2020 5:58 PM

విశాఖలో రెచ్చిపోయిన మరొక ప్రేమోన్మాది...యువతిపై కత్తితో దాడి


ఇటీవల విశాఖ గాజువాకలో వరలక్ష్మి ఘటన మరువకముందే మరో ఉదంతం వెలుగుచూసింది. విశాఖ వన్‌టౌన్‌ ఫెర్రీ వీధిలో వాలంటీర్‌ గా పనిచేస్తున్న ప్రియాంక పై శ్రీకాంత్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.

ఆమె మరొకరితో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న ప్రియుడు శ్రీకాంత్ ఆమెపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమెపై దాడి చేసిన అనంతరం తాను మెడపై కోసుకున్నాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు.. వాళ్లను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియాంక పరిస్థితి విషమంగా ఉందని, దాడికి పాల్పడిన శ్రీకాంత్‌ కు గాయం చిన్నదవ్వడంతో అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు. యువతి డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ గ్రామ సచివాలయంలో పనిచేస్తోంది.

Tags :
|
|
|

Advertisement