Advertisement

మొబైల్‌ యాప్స్‌పై మాల్‌వేర్‌ టార్గెట్

By: chandrasekar Sat, 18 July 2020 3:34 PM

మొబైల్‌ యాప్స్‌పై మాల్‌వేర్‌ టార్గెట్


బ్యాంకింగ్‌, సోషల్‌మీడియా, మొబైల్‌ యాప్స్‌పై మాల్‌వేర్‌ దాడి చేసి డేటాను దొంగిలిస్తున్నది. సుమారు 337 యాప్‌లను మాల్‌వేర్‌ టార్గెట్‌ చేసినట్లు తెలిసింది.

ఆండ్రాయిడ్‌ వినియోగదారులను మరో కొత్త మాల్‌వేర్‌ వణికిస్తోంది. బ్లాక్‌రాక్‌ అనే కొత్త ఆండ్రాయిడ్‌ మాల్‌వేర్‌ను మొబైల్‌ సెక్యూరిటీ కంపెనీ థ్రెట్‌ఫాబ్రిక్‌ కనుగొన్నది. మే 2020లో తొలుత మాల్‌వేర్‌ను గుర్తించారు.

ముఖ్యంగా పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌కార్డ్‌ సమాచారాన్ని తస్కరించడానికి మాల్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు సెక్యూరిటీ సంస్థ తెలిపింది.

బ్లాక్‌రాక్‌ ప్రస్తుతం థర్డ్‌పార్టీ సైట్‌లు అందించే ఫేక్‌ గూగుల్‌ అప్‌డేట్‌ ప్యాకేజీల ద్వారా ఈ మాల్‌వేర్ ‌ చొరబడుతుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఇంకా మాల్‌వేర్‌ ప్రవేశించలేదు.

లైఫ్‌స్టైల్‌, న్యూస్‌ యాప్స్‌, జీమెయిల్‌, ఉబెర్‌, ట్విటర్‌, స్పాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర యాప్‌లను బ్లాక్‌రాక్‌ లక్ష్యంగా చేసుకునే ఛాన్స్‌ ఉంది.

ఇ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే లింక్స్‌ ఆధారంగా యాప్‌లను డౌనలోడ్‌ చేయకుండా ఉండాలని, స్మార్ట్‌ఫోన్‌లోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌, యాప్‌ వెర్షన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయమని సైబర్‌ నిపుణులు సూచన.

Tags :
|
|
|

Advertisement