Advertisement

  • స్వార్ధ‌ ప్ర‌యోజ‌నాల కోసం కేసీఆర్ తెలంగాణ తాక‌ట్టు...బ‌ట్టి విక్ర‌మార్క‌

స్వార్ధ‌ ప్ర‌యోజ‌నాల కోసం కేసీఆర్ తెలంగాణ తాక‌ట్టు...బ‌ట్టి విక్ర‌మార్క‌

By: Dimple Mon, 10 Aug 2020 3:22 PM

స్వార్ధ‌ ప్ర‌యోజ‌నాల కోసం కేసీఆర్ తెలంగాణ తాక‌ట్టు...బ‌ట్టి విక్ర‌మార్క‌

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి పాల‌న అరాచ‌కంగా ఉంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మ‌ల్లు బ‌ట్టి విక్ర‌మార్క్ ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ త‌న స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ‌లోని పాల‌న విధానాల‌ను ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ముఖ్యంగా క‌రోనా విష‌యంలో తెలంగాష స‌ర్కారు ఘోరంగా విఫ‌లం చెందిందంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో దక్షిణ తెలంగాణ ఎడారి కాబోతోందని, అయినా.. కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్‌ చేస్తున్న కుట్రలను సీఎల్పీ ఖండిస్తోందన్నారు. కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి ఈ సమస్యను వివరిస్తామని, ఇందుకోసం కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లనుందని తెలిపారు.
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు.. హత్యలపై సామాజికన్యాయ శాఖ మంత్రిని కలుస్తామని, రాష్ట్రపతికి, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఆదివారం సీఎల్పీ భేటీలో ఆమోదించిన తీర్మానాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా హాల్లో భట్టి విక్రమార్క వె చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యానికి ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. సీఎల్పీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను సందర్శిస్తామని తెలిపారు. చేనేత ఉత్పత్తులను అమ్ముకోలేక నేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలనే కాకుండా.. పార్టీ కార్యాలయాలను కూడా టీఆర్‌ఎస్‌ ఆక్రమిస్తోందని భట్టివిక్రమార్క ఆరోపించారు. మణుగూరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి టీఆర్‌ఎస్‌ రంగులు వేశారని, కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు జరిపారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్ట్‌ షాపులను వెంటనే మూసేయాలని భట్టి డిమాండ్‌ చేశారు.

Tags :
|
|

Advertisement