Advertisement

  • కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్న మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే

కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్న మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే

By: chandrasekar Sat, 06 June 2020 12:14 PM

కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్న మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే


కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున రాజ్య‌స‌భ‌కు పంప‌నున్న‌ట్లు ఆ పార్టీ అధిష్ఠానం స్ప‌ష్టం చేసింది. కర్ణాటక నుంచి ఆయ‌న రాజ్యసభకు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు క‌ర్ణాట‌క నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖ‌ర్గే పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది.

ఖర్గే అభ్యర్థిత్వాన్ని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదించినట్టు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రాష్ట్రాల నుంచి ఖాళీ అయిన 18 రాజ్యసభ స్థానాలకు ఈ నెల‌ 19న ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే 2009, 2014 ఎన్నిక‌ల్లో గుల్బర్గా లోక్‌స‌భ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో గుల్బర్గా నుంచి ఉమేష్ జాదవ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అంత‌కు ముందు వరుసగా 10 సార్లు క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేతగా, రైల్వే, కార్మిక, ఉపాధి క‌ల్ప‌న‌ శాఖల‌ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.


Tags :

Advertisement