Advertisement

  • అమర జవాన్లకు సంతాపం ప్రకటించిన మాల్దీవులు విదేశాంగ మంత్రి

అమర జవాన్లకు సంతాపం ప్రకటించిన మాల్దీవులు విదేశాంగ మంత్రి

By: Sankar Fri, 19 June 2020 8:41 PM

అమర జవాన్లకు సంతాపం ప్రకటించిన మాల్దీవులు విదేశాంగ మంత్రి



చైనా ఇండియా సైన్యాలకు మధ్య జరిగిన సంఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందారు ..దీంతో దేశంలోని అన్ని రంగాల వారు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు ..అయితే మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌ సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేసాడు..ట్విట్టర్ లో భారత ప్రజలు, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.కేవలం మాల్దీవులు మాత్రమే కాకుండా అమెరికా , జర్మనీ దేశాల మంత్రులు కూడా భారత వీర జవాన్లకు సంతాపాన్ని తెలియజేసారు..ఈ నేపథ్యంలో చైనా- భారత్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అమెరికా పేర్కొనగా.. ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదంలో భారత్‌కు మద్దతుగా ఉంటామని రష్యా ప్రకటించింది..

భారత్ కు , మాల్దీవులకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ...గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పీఠం దక్కించుకున్న ఇబ్రహీం మహ్మద్‌ సోలి భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా తన ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించగా.. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు, ఒకరి ఆశయాలు, ప్రయోజనాల్ని మరొకరు పరస్పరం గౌరవించుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు.

ఇక భారత్‌కు రక్షణపరంగా ఎంతో ముఖ్యమైన మాల్దీవుల్లో 1100లకు పైగా దీవులు ఉన్నాయి. ఈ కారణంగా మాల్దీవులకు భారత్‌ సుదీర్ఘకాలంగా రక్షణ కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ను దెబ్బతీసేందుకు 2012లో మాల్దీవులు గద్దెనెక్కిన అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను మచ్చిక చేసుకున్న చైనా.. ఆయనతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశానికి సంబంధించిన ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.




Tags :

Advertisement