Advertisement

కరోనాను చంపేసే కత్తిలాంటి ఆరు పొరల మాస్క్

By: chandrasekar Tue, 28 July 2020 09:22 AM

కరోనాను చంపేసే  కత్తిలాంటి ఆరు పొరల మాస్క్


మాస్క్ ఏదైనా ఒకేసారి 4 గంటలు వాడితే దానిపై వాలే కరోనా వైరస్ మెల్లగా అన్ని దిక్కులకూ పాకి అలాగే ముక్కు, నోట్లోకి వెళ్లిపోతుందట. అందువల్ల మాస్కును 4 గంటల కంటే ఎక్కువగా కంటిన్యూగా వాడకూడదంటున్నారు. బెంగళూరులో ఐషీల్డ్ అనే స్టార్టప్ సంస్థ కత్తిలాంటి ఆరు పొరల (Six-layer) మాస్క్ తయారుచేసింది. ఇందుకోసం టెక్‌ఫాబ్రిక్ అనే మెటీరియల్ వాడింది. ఈ మెటీరియల్ మాలిక్యూల్ చుట్టూ ఉంటూ గుచ్చుకుంటూ ఉంటుంది. అందువల్ల అటుగా కరోనా వైరస్ వచ్చిందంటే అది మధ్యలో ఇరుక్కొని కన్నంపడి చచ్చిపోతుందని సంస్థ తెలిపింది.

లిపిడ్ బైలేయర్ అని పిలిచే పదార్థంతో మాస్క్ బయటి పొరను తయారుచేసినట్లు ఐషీల్డ్ సహ వ్యవస్థాపకుడు నితీష్ సత్యనారాయణ్ తెలిపారు. తమ మాస్క్ వల్ల కరోనా వైరస్ మాస్కుపై వాలగానే దాని ఉపరితలంపై కన్నం పడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే మాస్క్ బయటిపొర చాలా గరుకుగా ఉంటుంది. మాస్క్ బయటిపొర ముళ్లలాంటి గరుకు పదార్థంతో ఉంటుందన్నమాట. అక్కడకు వైరస్ రాగానే అది ఎటు కదిలినా ముళ్లు లాంటి పదార్ధం గుచ్చుకుంటుంది. దాంతో వైరస్ అక్కడే చచ్చిపోతుంది.

వెలుపలి పొర దగ్గరే వైరస్ చచ్చిపోతే మరి మిగతా ఐదు పొరలు ఎందుకూ అన్న సందేహం మనకు రావచ్చు. సపోజ్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఆ మాస్క్ ధరిస్తే... ఆ వ్యక్తి ముక్కు, నోరు నుంచి బయటకు వచ్చే వైరస్ లోపల ఉండే పొరలపై పడుతుంది. ఆ పొరలపై గరుకుదనం గుచ్చుకొని వైరస్ ఖతం అవుతుంది. ఐతే ఈ మాస్క్ మనుషులకు ఎలాంటి హానీ చెయ్యదనీ, ఎలాంటి గరుకుదనమూ అనిపించదనీ ఇందుకు కారణం తాము వాడిన టెక్ ఫ్యాబ్రిక్కే అని చెబుతున్నారు.

ఈ మాస్క్ తయారీలో మాలిక్యూల్స్‌ని మాస్క్‌కి సెట్ చెయ్యడం ఎలా అనే సవాల్ ఎదురైంది. ఇందుకోసం ఓ లింకర్‌ను వాడారు. ఇది కాటన్ వంటి పదార్థాలతో లింక్ అవుతుంది. ఇలా లింక్ 30 సార్లు మాస్కును ఉతికినా పోదు. సబ్బుతో ఉతికితే ఈ లింకర్ పోదు. అదే బ్లీచింగ్‌తో ఉతికితే మాత్రం పోతుందని సత్యనారాయణ్ చెప్పారు. మొత్తంగా తమ మాస్క్ ఎన్ని గంటలైనా వాడొచ్చనీ, ఎందుకంటే మాస్క్ పై వాలిన వైరస్ చనిపోతుంది కాబట్టి మాస్క్ వల్ల ఎలాంటి హానీ ఉండదని ఐషీల్డ్ చెబుతోంది. ఇప్పుడీ మాస్క్‌పై అందరి దృష్టీ పడింది. ఆరు లేయర్లు ఉన్నాయి కాబట్టి దీన్ని వాడటం మేలనే అభిప్రాయం వస్తోంది.

Tags :
|
|

Advertisement