Advertisement

  • ఆస్పత్రి నుంచి డిశ్చార్జి... ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి...!

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి... ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి...!

By: Anji Tue, 17 Nov 2020 09:09 AM

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి... ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి...!

ఆస్పత్రి నుంచి డిశ్చార్జిఅయి ఇంటికి వెళుతున్నవారిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఆస్పత్రికెళ్లి రోగం పోగుట్టుకున్నా ప్రాణాలు మాత్రం నిలువలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వృద్ధురాలు కుదుటపడి అంబులెన్స్‌లో ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని కబళించింది.

ఈ దుర్ఘటన మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి వివరాల ప్రకారం..వెల్దండ మండలం, బొల్లంపల్లి గ్రామానికి చెందిన మారి జంగమ్మ (70), రాజమోని ఆనంద్‌( 28)లు కొత్తపేట సాయి సంజీవిని దావాఖాన నుంచి డిశ్చార్జి అయి అంబులెన్స్‌లో ఇంటికి బయలుదేరారు.

అయితే కొత్తూరు గేట్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన స్విఫ్ట్‌ డిజైర్‌ అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జంగమ్మతో పాటు మరో ఇద్దరు అక్క డికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం గొల్లంపల్లికి చెందిన జక్కుల జంగమ్మ(70)ను ఈనెల 13న కాలు విరగడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం కుదుటపడటంతో సోమవారం కుమార్తె నూనె సాయమ్మ(45), మనుమరాలు జక్కుల మంజుల వృద్ధురాలితో కలిసి అంబులెన్స్‌లో స్వగ్రామానికి బయలుదేరారు.

శ్రీశైలం-హైదరాబాద్‌ రహదారిపై కొత్తూరు గేట్‌ సమీపంలో కల్వకుర్తి నుంచి నగరానికి వెళ్తున్న కారు అంబులెన్స్‌ను బలంగా ఢీకొనడంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. జంగమ్మ, అంబులెన్స్‌ డ్రైవర్‌ కల్వకుర్తి మండలం వేపూరుకు చెందిన రాచమోని ఆనంద్‌(28) అక్కడికక్కడే మృతి చెందారు.

సాయమ్మ ఆసుపత్రిలో మృతిచెందింది. గాయపడిన మంజుల, కారు డ్రైవర్‌ కుమార్‌లను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Advertisement