Advertisement

  • బైక్‌లపై కత్తులతో సవారీ... దిమ్మతిరిగే ట్విస్ట్...!

బైక్‌లపై కత్తులతో సవారీ... దిమ్మతిరిగే ట్విస్ట్...!

By: Anji Sat, 21 Nov 2020 8:59 PM

బైక్‌లపై కత్తులతో సవారీ... దిమ్మతిరిగే ట్విస్ట్...!

ప్రశాంతంగా ఉన్న నెల్లూరు నగరంలో ఓ గ్యాంగ్ కత్తులతో హల్ చల్ చేసింది. బైక్‌లపై యథేచ్ఛగా కత్తులతో సవారీ చేస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. దీన్ని చూసిన జనాలు బెంబేలెత్తిపోయారు.

వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల వచ్చి విచారించగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అక్కడ జరుగుతోందని షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగిందంటే.. నెల్లూరులో ఓ షార్ట్ ఫిల్మ్ ట్రూప్ హల్‌చల్‌ చేసింది. కొంతమంది యువకులు కత్తులతో బైక్‌పై చక్కర్లు కొడుతూ స్థానికులను బెంబేలెత్తించారు.

అయితే ఇది నిజమైన గొడవని ఆందోళనకు గురైన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సైతం హుటాహుటిన ముత్తుకూరు గేటు వద్దకు చేరుకున్నారు.

ఆ యువకులను అడ్డుకుని విచారించగా, తాము షార్ట్ ఫిల్మ్ చేస్తున్నామని చెప్పారు. అయితే షార్ట్‌ఫిల్మ్‌ షూట్‌కు అనుమతి లేదంటూ యువకులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే తాము కార్పొరేషన్‌ వద్ద పర్మిషన్‌ తీసుకున్నామని సదరు యవకులు చెప్పడంతో మందలించి వదిలేశారు.

Tags :
|

Advertisement