Advertisement

  • తెలంగాణలో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ అయిన మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభం ..

తెలంగాణలో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ అయిన మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభం ..

By: Sankar Fri, 24 July 2020 2:10 PM

తెలంగాణలో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ అయిన మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభం ..



తెలంగాణలో మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభమైంది. తెలంగాణ మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వర్చువల్‌గా యూనివర్సిటీని ప్రారంభించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో 130 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు.

ఈ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో.. మేనేజ్‌మెంట్, మీడియా, లా, ఎడ్యుకేషన్, లిబరల్ ఆర్ట్స్, డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తారు. మహీంద్రా ఎకోలే సెంట్రేల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కూడా ఈ యూనివర్సిటీలో భాగం కానుంది. యూనివర్సిటీ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి ప్రయివేట్ యూనివర్సిటీ ఇది కావడం విశేషం.

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఏర్పాటుకు ఇదే ఆసక్తికరమైన తరుణమన్నారు. ఆన్‌లైన్ ద్వారా నేర్చుకోవడం ఇటీవలి కాలంలో పెరిగిందన్నారు. మెరుగైన ప్రపంచం కోసం భావితరాలకు విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల కోసం 1950ల్లోనే కేసీ మహీంద్రా స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ప్రారంభించారన్నారు.

ప్రతి 8 మంది భారతీయుల్లో ఒకరు మాత్రమే కాలేజీ విద్యను అభ్యసించగల్గుతున్నారని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ప్రతి నలుగురిలో ఒకరు కాలేజీ వెళ్లేలా చేయడాన్ని మనం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు..

Tags :

Advertisement