Advertisement

  • తెలంగాణాలో భారీ పెట్టుబడులకు సిద్దమయిన మహీంద్రా ...

తెలంగాణాలో భారీ పెట్టుబడులకు సిద్దమయిన మహీంద్రా ...

By: Sankar Tue, 17 Nov 2020 11:13 PM

తెలంగాణాలో భారీ పెట్టుబడులకు సిద్దమయిన మహీంద్రా ...


తెలంగాణలో ఇప్పటికే భారీ పెట్టుబడిపెట్టిన మహీంద్రా సంస్థ... మరో వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.. భారతదేశపు అతిపెద్ద ట్రాక్టర్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం), కొత్త కే 2 సిరీస్ ట్రాక్టర్లను ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమయ్యేలా తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్లో అదనంగా 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది.

దీంతో.. జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో కార్మికుల సంఖ్య రెట్టింపు కానుంది... జహీరాబాద్‌లో మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ నిర్వహిస్తుండగా... ఇప్పుడు తన నూతన కే2 సిరీస్ ట్రాక్టర్ల తయారీని ప్రకటించింది మహీంద్రా గ్రూప్... జహీరాబాద్‌లో ఉన్న తమ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని ఈ సందర్భంగా తెలిపింది మహీంద్రా సంస్థ...

ఇక, మహీంద్రా నూతన పెట్టుబడిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు.. తెలంగాణకి నూతన కంపెనీల పెట్టుబడులతో పాటు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు కూడా విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఎం అండ్ ఎమ్ తన తెలంగాణ యూనిట్లో కార్యకలాపాలను విస్తరిస్తుండగా, 2024 నాటికి ఉపాధిని రెట్టింపు చేయాలని యోచిస్తోంది.. తెలంగాణలో ఏకైక ట్రాక్టర్ తయారీ సంస్థ అయిన ఈ సంస్థ ఇప్పటికే జహీరాబాద్‌లోని రూ.1,087 కోట్ల పెట్టుబడి పెట్టింది...

Tags :

Advertisement