Advertisement

  • భారీ రికార్డును సెట్ చేసిన మహేష్ బాబు డిజాస్టర్ మూవీ

భారీ రికార్డును సెట్ చేసిన మహేష్ బాబు డిజాస్టర్ మూవీ

By: chandrasekar Fri, 04 Sept 2020 4:18 PM

భారీ రికార్డును సెట్ చేసిన మహేష్ బాబు డిజాస్టర్ మూవీ


భారీ రికార్డును సెట్ చేసిన మహేష్ బాబు డిజాస్టర్ మూవీ ఇప్పుడు కొత్త రికార్డుల్లో. అప్పుడప్పుడు ఫ్లాపు మూవీలు కూడా హీరోల కెరీర్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి ఓ రికార్డు మహేష్ బాబు ఖాతాలో చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో బ్లాక్ బస్టర్స్‌తో పాటు అదే రేంజ్‌లో డిజాస్టర్స్ ఉన్నాయి. కానీ మహేష్ బాబు కెరీర్‌లోనే డిజాస్టర్ మూవీగా నిలిచిన ’ఆగడు’ సినిమా ఇపుడు భారీ రికార్డును సెట్ చేసింది. అది కూడా మన దేశంలోనే ఇదో సెన్సేషనల్ రికార్డు అని చెప్పాలి. ‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ‘ఆగడు’ సినిమా ఏ రేంజ్‌లో ఫ్లాప్ అయిందో అందరికి తెలిసిందే.

ఆగడు సినిమా తర్వాత దర్శకుడిగా శ్రీను వైట్ల కెరీర్ గ్రాఫ్ కూడా అమాంతం పడిపోయిందే కానీ మళ్లీ నిలబడలేదు. ఇక మహేష్ బాబు కెరీర్‌లోనే ‘అత్యంత చెత్త సినిమాగా ‘ఆగడు’ సినిమా రికార్డులకు ఎక్కింది. కానీ ఇదే సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో ఏకంగా 500 మిలియన్ వ్యూస్ అందుకొంది. హిందీ డబ్బింగ్‌ చేయబడ్డ వివిధ వెర్షన్స్ అన్ని కలిపితే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 500 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

చాలా అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఈ ఆగడు సినిమాకు లభించింది. ఈ మార్క్ అది కూడా మన భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అందులో ఒక డిజాస్టర్ మూవీకి రావడం ఇదే మొదటిసారే అని చెప్పాలి. ఇక యూట్యూబ్‌లో విడుదలైన ఏ భారతీయ చిత్రం ఇప్పటి వరకు 500 మిలియన్ వ్యూస్ దక్కించుకోలేదు. ఇపుడా రికార్డు మహేష్ బాబు పేరు మీద ఉండటం చూసి మహేష్ బాబు అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా తెలుగులో 100 మిలియన్ వ్యూస్ రాబట్టిన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అనతి కాలంలో అనేక సినిమాలు అధిక సంఖ్యలో డిస్ లైక్లు కూడా రికార్డు చేసుకున్నాయి.

Tags :
|
|

Advertisement