Advertisement

  • మరో అరుదైన ఐపీల్ రికార్డును నమోదు చేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ

మరో అరుదైన ఐపీల్ రికార్డును నమోదు చేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ

By: chandrasekar Sat, 03 Oct 2020 11:33 AM

మరో అరుదైన ఐపీల్ రికార్డును నమోదు చేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ


మిస్టర్ కూల్ కెప్టెన్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఐపీల్ 2020 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో ఐపిఎల్ రికార్డు వచ్చి చేరింది. శుక్రవారం రాత్రి దుబాయ్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో ధోనీ ఓ అరుదైన ఘనత సాధించాడు. యూఏఈ లో జరిగే ఐపీల్ మ్యాచ్ల్లో ధోని ఈ రికార్డు నమోదు చేసాడు. అదేంటంటే ఇప్పటివరకు ఐపిఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ధోనీ నిలవడం విశేషం.

నిన్న యూఏఈ లో జరిగిన మ్యాచ్‌కి ముందు వరకు ధోనీ ఐపిఎల్‌లో మొత్తం 193 మ్యాచ్‌లు ఆడాడు. తన మాజీ టీమ్‌మేట్ సురేష్ రైనా ఆడిన ఐపిఎల్‌ మ్యాచ్‌లకు ఇది సమానం. కానీ ఈ రోజు ఆడిన మ్యాచ్ ధోనీ ఐపిఎల్ కెరీర్‌లో 194వ మ్యాచ్ కావడంతో ఇప్పటివరకు సురేష్ రైనా పేరిట ఉన్న అత్యధిక ఐపిఎల్ మ్యాచ్‌ల రికార్డును ధోనీ అధిగమించాడు. ఇలా ధోని చాలా రికార్డులు నమోదు చేసుకున్నారు.

నిన్న జరిగిన మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ ఎం.ఎస్. ధోనీ తన రికార్డును బ్రేక్ చేయడంపై సురేష్ రైనా సైతం హర్షం వ్యక్తంచేశాడు. ధోనీ చేతిలో తన రికార్డు బద్దలవడం తనకు సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన రైనా ఇవాళ్టి మ్యాచ్‌లో గెలవాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపిఎల్ సీజన్ గెలుస్తుందని సురేష్ రైనా ధీమా వ్యక్తంచేశాడు. ఇక ఈ రికార్డులో ధోనీ, సురేష్ రైనా తర్వాత స్థానంలో 192 మ్యాచ్‌లతో ముంబై ఇండియన్స్ కెప్టేన్ రోహిత్ శర్మ ఉన్నాడు.

Tags :
|

Advertisement