Advertisement

ఆ రాష్ట్రంలో జులై 31వరకు లాక్ డౌన్

By: Sankar Mon, 29 June 2020 5:41 PM

ఆ రాష్ట్రంలో జులై 31వరకు లాక్ డౌన్



కరోనా కారణంగా మహారాష్ట్ర అల్లాడుతోంది ..వేలకు వేల కేసులతో అతలాకుతలం అవుతుంది ..ప్రస్తుతం ఇండియాలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలలో ఢిల్లీ , ముంబై పోటీపడుతున్నాయి ..అయితే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో లాక్ డౌన్ ఎత్తివేస్తే ఇంకా కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం జులై 31 వరకు లాక్ డౌన్ అమలు అవుతున్నట్లు ప్రకటించింది ..ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది.కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.

దేశంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 5.48 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కేవలం మహారాష్ట్రలోనే 1,64,626 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 86,575 మంది డిశ్చార్జి కాగా, 7,429 మంది మృతిచెందారు. ప్రస్తుతం 70,622 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా కేసులు సంఖ్య పెరగడంతో ఇప్పటికే పలు నగరాల్లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలనీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కోరిన విషయం తెలిసిందే ..ప్లాస్మా థెరపీ వలన కరోనా నుంచి ప్రజలు కోలుకుండుండటంతో కరోనా నుంచి కోలుకుంటున్న వారు ప్లాస్మా దానం చేయాలనీ రిక్వెస్ట్ చేసారు ..

Tags :
|

Advertisement