Advertisement

  • కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి ..మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే పిలుపు

కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి ..మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే పిలుపు

By: Sankar Sun, 28 June 2020 6:32 PM

కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి ..మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే పిలుపు



దేశంలోని కోవిడ్ బాధిత రాష్ట్రాల్లో తొలి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో ప్లాస్మా థెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్లాస్మా థెరపీ కేంద్రాన్ని సోమవారంనాడు ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ప్లాస్మా థెరపీ చికిత్సలు పెద్దఎత్తున చేపడుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, కోవిడ్ నుంచి విముక్తి పొంది, స్వస్థత చేకూరిన వారు ముందుకు వచ్చి ప్లాస్మాను డొనేట్ చేయాలని, కరోనాపై జరుపుతున్న పోరాటానికి సహకరించాలని కోరారు.

మంగళవారంనాడు జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకోనున్నాం. వైద్యులు మన కోసం పోరాడుతున్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కోవిడ్-19 నుంచి ఇంకా మనం విముక్తులం కాలేదు. కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలి' అని అన్నారు.మహారాష్ట్రలో కోవిడ్ సమస్య, స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో రైతు రుణాల మాపీలో జాప్యం తలెత్తిందని సీఎం చెప్పారు.

ఇప్పుడు తక్కిన రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ఇళ్లలోనో ఉంటూ, పండుగలను కూడా వదులుకున్న అన్ని మతాల ప్రజలకు ఉద్ధవ్ థాకరే కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి గణేష్ ఉత్సవ నిర్వాహకులను కూడా సామాజిక దూరం పాటించాలనే నిబంధనల ప్రకారం 4 అడుగుల విగ్రహాలను మాత్రమే ఉంచాలని కోరానని, ప్రభుత్వ ఆదేశాలను పాటస్తామని నిర్వాహకులు భరోసా ఇచ్చారని ఉద్ధవ్ థాకరే తెలిపారు.

Tags :
|
|

Advertisement