Advertisement

  • మహారాష్ట్ర లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం ..ఒక్కరోజే 181 మంది మృతి

మహారాష్ట్ర లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం ..ఒక్కరోజే 181 మంది మృతి

By: Sankar Mon, 29 June 2020 8:57 PM

మహారాష్ట్ర లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం ..ఒక్కరోజే 181 మంది మృతి



మహారాష్ట్ర లో కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చాయి ..తాజాగా తాజాగా 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న తీరు ప్రజలను ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇవాళ కూడా మహారాష్ట్రలో 5,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,883కు చేరింది. మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో కల్లోలం రేపుతోంది.

మహారాష్ట్రలో కరోనా సోకిన వారిలో కొత్తగా 181 మంది మరణించారు. దీంతో.. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 7,610కి చేరింది. కరోనా తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతుండటంతో జూలై 31 వరకూ మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ థాక్రే సోమవారం ప్రకటించారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 73298. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 9,43,485 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,69,883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 5, 74,093 మంది హోం క్వారంటైన్‌లో ఉండగా.. 37,758 మంది ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. రికవరీ రేటు మహారాష్ట్రలో మెరుగ్గానే ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. మహారాష్ట్రలో రికవరీ రేటు ప్రస్తుతం 52.37 శాతంగా ఉంది.

Tags :
|

Advertisement