Advertisement

  • యూకే నుంచి వచ్చేవారులో లక్షణాలు లేకుంటే పరీక్షలు జరపము ...మహారాష్ట్ర ప్రభుత్వం

యూకే నుంచి వచ్చేవారులో లక్షణాలు లేకుంటే పరీక్షలు జరపము ...మహారాష్ట్ర ప్రభుత్వం

By: Sankar Fri, 25 Dec 2020 10:24 AM

యూకే నుంచి వచ్చేవారులో లక్షణాలు లేకుంటే పరీక్షలు జరపము ...మహారాష్ట్ర ప్రభుత్వం


యూకే కొత్త కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ లోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి..ఇప్పటికే యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించినప్పటికీ , అంతకుముందు బ్రిటన్ నుంచి వచినవారిపై ద్రుష్టి సారించాయి..అందులో భాగంగా గత కొంతకాలంగా బ్రిటన్ నుంచి వచ్చిన వారిని అన్వేశించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం...

అయితే యూకే నుంచి వచ్చే ప్రయాణికులలో ఎటువంటి కరోనా లక్షణాలు లేని వారికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు జరపమని మహరాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. యూరప్, దక్షిణ ఆఫ్రికా ఇతర దేశాల నుంచి వారికి ఎటువంటి పరీక్షలు ఉండవని తేల్చి చెప్పింది.

మహరాష్ట్రకు వచ్చిన వారిలో లక్షణాలు లేని వారని పెయిడ్ క్వారంటైన్‌కు తరలిస్తామని, అక్కడ ఉంచిన ఐదు, ఏడు రోజులలో వారి ఖర్చుతో ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇటీవల యూరప్ నుంచి రానున్న ప్రయానీకుల విషయంలో అన్ని అనుమతులతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్‌ను తీసుకురావాలని తెలిపారు.

Tags :

Advertisement