Advertisement

  • బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే

బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే

By: Sankar Sun, 13 Dec 2020 10:47 PM

బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే


రైతులను ఉగ్రవాదులుగా అనే వారెవరూ మనుషులు అనిపించుకోరని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరననలు చేస్తున్న రైతులను బీజేపీ నేతలు ఉగ్రవాదులతో పోల్చడంపై ఆయన మండిపడ్డారు.

మహారాష్ట్రలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉందని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించడంపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏమి జరుగుతున్నదని ఉద్ధవ్‌ ప్రశ్నించారు. అక్కడ అప్రకటిత అత్యవసర పరిస్థితి లేదా అని నిలదీశారు.

నిరసనలు చేస్తున్న అన్నదాతలను ఉగ్రవాదులతో బీజేపీ నేతలు పోల్చుతున్నారని దుయ్యబట్టారు. రైతులను ఉగ్రవాదులుగా పిలిచే వారు మానవుడు అనిపించుకోడని ఉద్ధవ్ థాకరే విమర్శించారు.కాగా గత కొంత కాలంగా రైతులు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే ..అయితే ప్రభుత్వం మాత్రం ఆ చట్టాలను వెనక్కి తీసుకోకపోవడంతో రైతులు కూడా పోరాటాన్ని ఇంకా ఉదృతం చేస్తున్నారు...

Tags :
|

Advertisement