Advertisement

  • పాకిస్తాన్ లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం రెండవ సారి ధ్వంసం

పాకిస్తాన్ లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం రెండవ సారి ధ్వంసం

By: Sankar Mon, 14 Dec 2020 4:43 PM

పాకిస్తాన్ లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం రెండవ సారి  ధ్వంసం


లాహోర్‌లో ప్రతిష్టించిన మహరాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహం మరోసారి ధ్వంసమైంది. ఈ ఘటనలో జీషన్‌ అనే టీనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. రంజిత్‌ సింగ్‌ 180వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం 2019 జూన్‌లో పాకిస్తాన్‌లోని లాహోర్‌ కోటలో విగ్రహాన్ని ప్రతిష్టించారు.

గతేడాది ఆగస్టులో తహ్రీక్‌-ఇ- లబాయిక్‌ పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రంజిత్‌ సింగ్‌ పాలన, భారత్‌లో మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు విగ్రహానికి మరమతులు చేయించారు.

కాగా తహ్రీక్‌-ఇ- లబాయిక్‌ పాకిస్తాన్‌ చీఫ్‌ ఖదీం రిజ్వీ ప్రసంగాలతో ప్రేరేపితుడైన జీషన్‌ డిసెంబరు 12న మరోసారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. విగ్రహం చేతులు విరగొట్టాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డులు వెంటనే అతడిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు.ఇక విచారణంలో భాగంగా.. తన పాలనాకాలంలో ముస్లింలకు వ్యతిరేకంగా రజింత్‌ సింగ్‌ అనేక అత్యాచారాలకు పాల్పడినందు వల్లే దాడి చేశానని జీషన్‌ చెప్పాడు

Tags :

Advertisement