Advertisement

  • మృత్యుంజయుడు నాలుగేళ్లబాలుడు - 18గంటలు శిధిలాల కిందనే ప్రాణాలతో పోరాటం

మృత్యుంజయుడు నాలుగేళ్లబాలుడు - 18గంటలు శిధిలాల కిందనే ప్రాణాలతో పోరాటం

By: Dimple Wed, 26 Aug 2020 00:44 AM

మృత్యుంజయుడు నాలుగేళ్లబాలుడు - 18గంటలు శిధిలాల కిందనే ప్రాణాలతో పోరాటం

మహారాష్ట్రలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన జరిగి దాదాపు 18గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న బాలుడు ఇలా ప్రాణాలతో సురక్షితంగా బయటపడటం అద్భుతమని అంటున్నారు స్థానికులు. ఈ ఘటనలో ఇంకా అదృశ్యమైన మరికొందరు కూడా ప్రాణాలతో బయటపడాలని ఆకాంక్షిస్తున్నారు.
రాయగడ్ జిల్లా మహద్‌ ప్రాంతంలో నిన్న రాత్రి ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 70మందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. అయితే, దాదాపు 22 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో ఇప్పటివరకు 60మందికి పైగా రక్షించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరినట్టు సమాచారం. ఇంకొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
శిథిలాల కింద చిక్కుకుపోయిన ఈ నాలుగేళ్ల బాలుడు చీకట్లో కూర్చొని ఉన్నట్టు గుర్తించిన ఇద్దరు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది.. కాంక్రీట్‌ శ్లాబ్‌ను తొలగించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని చెప్పారు. అలాగే, బాలుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ వైద్యసాయం కోసం ఆస్పత్రికి తరలించారు.
మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 12 అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గ్యాస్‌ కట్టర్‌లు, ఇతర యంత్రాలను ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నారు. పదేళ్ల క్రితం నిర్మించిన ఈ నివాసిత భవనంలో మొత్తం 45 ఫ్లాట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది జాగిలాలను రంగంలోకి దించి గాలిస్తున్నారు.

Tags :
|
|

Advertisement