Advertisement

  • దాదాపు అయిదు నెలల తర్వాత తెరుచుకున్న మదురై మీనాక్షి ఆలయం

దాదాపు అయిదు నెలల తర్వాత తెరుచుకున్న మదురై మీనాక్షి ఆలయం

By: Sankar Tue, 01 Sept 2020 6:05 PM

దాదాపు అయిదు నెలల తర్వాత తెరుచుకున్న మదురై మీనాక్షి ఆలయం


తమిళనాడులో ప్రజారవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా విజృంభణ నేపథ్యంలో గత 5 నెలలుగా ప్రజారవాణాకు బ్రేక్ పడింది. ఇక తాజాగా చేసిన సడలింపులతో ప్రజారవాణా ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో చెన్నై నగరం సహా కోయంబత్తూర్, మదురై, తిరుచ్చి నగరాలలో బస్సులు తిరుగనున్నాయి.

మరోవైపు తాజా సడలింపుల్లో ఆలయాలు తెరవడానికి సైతం అనుమతినిచ్చారు. దాంతో నేటి నుండి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం, తిరుచ్చి శ్రీరంగం, కంచిలో ఉన్న ఆలయాలతో సహా ఇతర ఆలయాల్లో అధికారులు శానిటైజేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు తెలిపారు. ఆలయాల్లో భౌతిక దూరం పాటించాలని సూచించారు.

కాగా మదురైలోని మీనాక్షి అమ్మన్‌ ఆలయం 165 రోజుల తర్వాత మంగళవారం తిరిగి తెరుచుకుంది. ఆన్‌లాక్‌-4 ప్రక్రియలో భాగంగా కొత్త సడలింపులతో భక్తులను పునఃదర్శనానికి అనుమతిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తొలిరోజే భక్తులు భారీగా తరలి వచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలోకి భక్తులను అనుమతించేముందు ఆలయ సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి భక్తుల చేతులకు శానిటైజర్‌ అందింస్తున్నారు. ముఖానికి మాస్కు లేకుంటే ఆలయంలోకి అనుమతిని నిషేధిస్తున్నారు.

Tags :
|
|

Advertisement