Advertisement

  • బ‌ట్ట‌లు ఉత‌క‌డం వ‌ల్ల త‌న చేయి సులువుగా ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపిన మ‌ధ్య ప్ర‌దేశ్‌ సీఎం

బ‌ట్ట‌లు ఉత‌క‌డం వ‌ల్ల త‌న చేయి సులువుగా ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపిన మ‌ధ్య ప్ర‌దేశ్‌ సీఎం

By: chandrasekar Tue, 28 July 2020 5:34 PM

బ‌ట్ట‌లు ఉత‌క‌డం వ‌ల్ల త‌న చేయి సులువుగా ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపిన మ‌ధ్య ప్ర‌దేశ్‌ సీఎం


కరోనా బారిన పడ్డ మ‌ధ్య ప్ర‌దేశ్‌ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో భాగంగా తన బ‌ట్ట‌లు నేనే ఉతుక్కుంటున్నాన‌ని వీడియో సందేశం ఇచ్చారు మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్. ఇటీవ‌లే ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ సోకిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భోపాల్‌లోని చిరాయు ఆస్ప‌త్రిలో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఆయ‌న భార్య‌కు మాత్రం కోవిడ్ ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న సీఎం శివ‌రాజ్ సింగ్ కోవిడ్ ట్రీట్‌మెంట్ గురించి వ‌ర్చువ‌ల్ వీడియోలో మాట్లాడారు. తాను కోవిడ్ పాజిటివ్ పేషెంట్ కాబ‌ట్టి త‌న బ‌ట్ట‌ల్ని తానే ఉతుక్కుంటున్న‌ట్లు తెలిపారు. అయితే త‌న బట్ట‌లు తానే ఉతుక్కోవ‌డం వ‌ల్ల త‌న‌కు ఓ బెనిఫిట్ జ‌రిగింద‌న్నారు. త‌న చేతికి ఇటీవ‌ల శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని, ఎన్నో సార్లు ఫిజియోథెర‌పి చేయించినా పిడికిలి ప‌ట్టుకోవ‌డం కుదిరేది కాద‌న్నారు. కానీ బ‌ట్ట‌లు ఉత‌క‌డం వ‌ల్ల ఇప్పుడు త‌న చేయి సులువుగా ప‌ని చేస్తున్న‌ట్లు సీఎం వీడియోలో పేర్కొన్నారు. ఇక రెండోసారి కూడా మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యులు తెలిపారు.

Tags :
|

Advertisement