Advertisement

  • షాకింగ్ న్యూస్ : అంతర్జాతీయ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్

షాకింగ్ న్యూస్ : అంతర్జాతీయ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్

By: Sankar Sat, 15 Aug 2020 8:38 PM

షాకింగ్ న్యూస్ : అంతర్జాతీయ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్


భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయయవంతమైన కెప్టెన్ , టి ట్వంటీ ప్రపంచ కప్ , వరల్డ్ కప్ , ఛాంపియన్స్ ట్రోఫీ వంటీ ఐసీసీ ట్రోఫీలను భారత్ కాతాలో చేర్చిన దిగ్గజ కెప్టెన్ , ప్రపంచ క్రికెట్ ఇప్పటివరకు చుసిన అత్యుత్తమ ఫినిషర్ , ఇండియన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వికెట్ కీపర్ , ఇండియా లో సచిన్ తర్వాత అంతటి స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించినా ఆటగాడు..మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు పలికాడు..

అందరి ఊహాగానాలను పటాపంచలు చేస్తూ , మరొకసారి తన కూల్ మేనరిజం తో ఎటువంటి ఆర్బాటం లేకుండా మహేంద్రుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు .చివరి సారిగా గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ సెమి ఫైనల్లో కివీస్ తో జరిగిన మ్యాచ్ లో ఆడిన ధోని ఆ తర్వాత మల్లి మైదానం లో బరిలోకి దిగలేదు ..అయితే ఇండియన్ క్రికెట్ కు ఎంతో సేవ చేసిన ధోని ఇలా సాధారణంగా రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల అభిమానూలు అసంతృప్తితో ఉన్నారు .

2004 లో బాంగ్లాదేశ్ తో జరిగిన వన్ డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ధోని , ఇప్పటివరకు మొత్తం 350 వన్ డే లు , 90 టెస్టులు , 98 టి ట్వంటీ లు ఆడాడు ..వన్ డే లలో 10773 పరుగులు చేసిన ధోని , పది సెంచరీలు , 73 అర్థ సెంచరీలు చేసాడు ..ఇక టెస్టుల్లో 4876 పరుగులు బాదాడు , ఇందులో ఆరు సెంచరీలు , ౩౩ అర్థ సెంచరీలు ఉన్నాయి ..ఇక టి ట్వంటీ క్రికెట్ లో 1617 పరుగులు చేసాడు ..ఇందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి..ఇక అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చేపినప్పటికీ ధోని ఐపీయల్ లో మాత్రం ఆడే అవకాశం ఉంది


Tags :

Advertisement