Advertisement

  • ఏకంగా 25 లాటరీ టిక్కెట్లు కొని అన్నింటిలో లక్కు కొట్టాడు లక్కీ ఫెలో...

ఏకంగా 25 లాటరీ టిక్కెట్లు కొని అన్నింటిలో లక్కు కొట్టాడు లక్కీ ఫెలో...

By: chandrasekar Fri, 07 Aug 2020 3:59 PM

ఏకంగా 25 లాటరీ టిక్కెట్లు కొని అన్నింటిలో లక్కు కొట్టాడు లక్కీ ఫెలో...


మాములుగా లాటరీలో ఒక దానిలో లక్కు కొట్టవచ్చు. అయితే ఏకంగా 25 లాటరీ టిక్కెట్లు కొని అన్నింటిలో లక్కు కొట్టి గెలుపొందిన వ్యక్తి ఆనందానికి అవధులు లేవు. వ‌ర్జీనియా బీచ్‌లో ఒక వ్యక్తికి ఏకంగా 25 లాట‌రీలు త‌గిలాయి. అన్ని త‌గ‌లాలాంటే అన్ని టికెట్లు కొని ఉండాలి క‌దా. కొన్నాడు కొంటేనే క‌దా వ‌చ్చేది. ఇత‌ను ఎన్ని న‌క్క తోక‌లు తొక్కాడో గాని జ‌స్ట్ అదృష్టాన్ని ప‌రీక్షించ‌ద‌ల‌చి లాట‌రీ టికెట్ కొందామ‌నుకున్నాడు. ఏ పుట్ట‌లో ఏం దాగుందో అని అక్క‌డున్న మొత్తం 25 టికెట్ల‌ను 25 డాల‌ర్లు వెచ్చించి కొన్నాడు. అదృష్టం అతన్ని వరించింది.

ఎందుకోమరి అతనికి ఏకంగా 25 లాటరీ టిక్కెట్లు కొనాలని ఈ ఆలోచన వచ్చిందో వచ్చింది అన్నిట్లో లక్కు కొట్టింది. రైమాండ్ హ్యారింగ్ట‌న్ అనే వ్య‌క్తి వ‌ర్జీనియా బీచ్‌లోని వేగ్నం స్టోర్‌లో ఈ లాట‌రీ టికెట్లు కొన్నాడు. ఒక‌టి కాక‌పోయినా మ‌రొక‌టి త‌గులుతుంది క‌దా అనుకొని ఆ ప‌ని చేశాడు. అయితే ఒక్కో లాట‌రీ త‌గిలితే 5 వేల డాల‌ర్లు బ‌హుమ‌తి వ‌స్తుంది. అలా 25 టికెట్లు ఇత‌నికి త‌గిలే స‌రికి సుమారు రూ. 93 ల‌క్ష‌లు వ‌ర‌కు గెలుచుకున్నాడు. దీంతో రైమాండ్ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఈ డ‌బ్బునంతా మంచి ప‌నుల‌కే ఉప‌యోగిస్తానంటున్నాడు. అంతేకాదు త‌న కొడుకును బాగా చ‌దివిస్తానంటున్నాడు. ఇటీవ‌ల క‌రోనా టైంలో సెక్యూరిటీ గార్డుకు కూడా లాట‌రీ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Tags :
|

Advertisement