Advertisement

  • సూర్యాపేట జిల్లాలో విషాదం ..ప్రేమజంట ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో విషాదం ..ప్రేమజంట ఆత్మహత్య

By: Sankar Fri, 11 Dec 2020 1:43 PM

సూర్యాపేట జిల్లాలో విషాదం ..ప్రేమజంట ఆత్మహత్య


సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దులచెరువులో విషాదం చోటుచేసుకుంది...పెళ్ళికి అంగీకరించలేదని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది..

చివ్వేంల మండలం, చందుపట్ల గ్రామానికి చెందిన నవీన్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ, వీరి వివాహానికి ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు.

దీంతో మనస్తాపానికి గురైన ప్రేమజంట గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి మొద్దుల చెరువు గ్రామంలోని శివారు ప్రాంతానికి చేరుకొని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|

Advertisement